వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ ఎన్‌కౌంటర్ : మావోయిస్టు హిడ్మా ఏరివేతకు 2 వేల మందితో వేట , కేంద్రం ఆపరేషన్ ప్రహార్ 3

|
Google Oneindia TeluguNews

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన మెరుపు దాడి ఒక్కసారిగా దేశాన్ని షాక్ కు గురి చేసింది. సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని టెర్రాం వద్ద శనివారం మావోయిస్టులు జరిపిన వ్యూహాత్మక దాడిలో 24 మంది జవాన్ల మరణంతో ప్రతీకారం తీర్చుకోవటానికి కేంద్ర బలగాలు రెడీ అయ్యాయి . ఇప్పటికే అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు . అందులో భాగంగా ఆపరేషన్ ప్రహార్ 3 కి రంగం సిద్ధం అయింది .

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ ఎన్‌కౌంటర్ .. నిఘా వైఫల్యం లేదు , దాదాపు 30 మంది నక్సల్స్ హతం : సీఆర్పీఎఫ్ చీఫ్ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ ఎన్‌కౌంటర్ .. నిఘా వైఫల్యం లేదు , దాదాపు 30 మంది నక్సల్స్ హతం : సీఆర్పీఎఫ్ చీఫ్

మావోయిస్టు కమాండర్ మాద్వి హిడ్మా టార్గెట్ గా కేంద్రం కీలక నిర్ణయం

మావోయిస్టు కమాండర్ మాద్వి హిడ్మా టార్గెట్ గా కేంద్రం కీలక నిర్ణయం

ఊహించని విధంగా 24 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . జవాన్లపై మావోయిస్టులు చేసిన దాడికి దీటుగా బదులు ఇవ్వాలని నిర్ణయించింది. ఛత్తీస్గఢ్ ‌లోని బీజాపూర్‌లో ఆకస్మిక మెరుపు దాడికి నాయకత్వం వహించిన మావోయిస్టు కమాండర్ మాద్వి హిడ్మా (55) 2004 నుండి ఇప్పటి వరకు 27 దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2013 కాంగ్రెస్ నాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టిన ఊచకోత , 2010 దంతేవాడ సమ్మె, 76 మంది జవాన్లను హతమార్చిన ఘటన లో హిడ్మా కీలక భూమిక పోషించారని సమాచారం.

మావోయిస్టుల లేథల్ బెటాలియన్ 1 యొక్క కమాండర్ హిడ్మా

మావోయిస్టుల లేథల్ బెటాలియన్ 1 యొక్క కమాండర్ హిడ్మా

మావోయిస్టుల లేథల్ బెటాలియన్ 1 యొక్క కమాండర్ హిడ్మా భద్రతా దళాలకు వ్యతిరేకంగా కార్యకలాపాల యొక్క ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించటంలో అందెవేసిన చెయ్యి. హిడ్మలు అని కూడా పిలువబడే హిడ్మా దక్షిణ సుక్మాలోని పూర్వతి గ్రామంలో జన్మించాడు . బీజాపూర్ లోని స్థానిక తెగకు చెందినవాడు. అతను 2001 ప్రారంభంలో నక్సల్స్‌లో చేరినట్లు సమాచారం. హిడ్మా చాలా క్రమశిక్షణ, తెలివైన, పదునైన వ్యక్తి . అంతే కఠినంగా ప్రవర్తించ గలిగిన వ్యక్తి అని , అందుకే అతను కమాండర్‌గా ప్రాముఖ్యత పొందాడని తెలుస్తుంది .

భద్రతా దళాలపై మెరుపుదాడులలో దిట్ట హిడ్మా .. 27 కి పైగా దాడులు

భద్రతా దళాలపై మెరుపుదాడులలో దిట్ట హిడ్మా .. 27 కి పైగా దాడులు

హిడ్మా భద్రతా దళాలకు మెరుపు దాడులలో దిట్ట . 2004 నుండి, అతను సిబ్బందిపై 27 కి పైగా దాడులకు పాల్పడ్డాడు. ఫ్రంట్‌లైన్ కాంగ్రెస్ నాయకుల 2013 జిరామ్ ఘాటి ఊచకోత , ఏప్రిల్ 2017 బుర్కపాల్ ఆకస్మిక దాడి, ఇందులో 24 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మరణించారు, 76 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మృతి చెందిన దంతేవాడ దాడి ఘటనలో కూడా ఆయన కీలక భూమిక పోషించారు అని రాష్ట్ర పోలీసు వర్గాలు తెలిపాయి.

హిడ్మా కోసం 2 వేల మంది భద్రతా దళాలు రంగంలోకి

హిడ్మా కోసం 2 వేల మంది భద్రతా దళాలు రంగంలోకి

దంతేవాడ దాడిలో, హిడ్మా ముందు ఉండి నడిపించాడు. సిల్జర్ మరియు బోడగుడ ప్రాంతంలో హిడ్మా ఉనికి గురించి నిర్దిష్ట సమాచారాన్ని అనుసరిస్తూ, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్జి), చత్తీస్గడ్ పోలీసు జిల్లా ఫోర్స్, సిఆర్పిఎఫ్ మరియు దాని ఉన్నత వర్గాల నుండి సుమారు 2 వేల మంది భద్రతా సిబ్బంది హిడ్మా కోసం వేట మొదలుపెట్టారు. కోబ్రా యూనిట్ - ఏప్రిల్ 2 న సంయుక్త ఆపరేషన్ ప్రారంభించింది.

 హిడ్మా లక్ష్యంగా ఆపరేషన్ ప్రహార్ 3

హిడ్మా లక్ష్యంగా ఆపరేషన్ ప్రహార్ 3

హిడ్మా లక్ష్యంగా ఆపరేషన్ ప్రహార్ 3 ను చేపట్టనున్నట్లు నిర్ణయించింది . హిడ్మా తో పాటుగా మరో ఎనిమిది మంది మావోయిస్టులను హిట్ లిస్టులో పెట్టింది కేంద్ర సర్కార్. మావోయిస్టుల ఏరివేత కోసం రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ జాబితాను తయారు చేస్తున్నట్లు సమాచారం.

English summary
the Maoist commander who is believed to have led the ambush in Chhattisgarh’s Bijapur Sunday, has allegedly been involved in 27 attacks since 2004,It is in the pursuit of specific inputs about Hidma’s presence in the Silger and Bodaguda area that around 2,000 security personnel — from the Special Task Force (STF), District Reserve Guard (DRG), District Force of Chhattisgarh Police, the CRPF and its elite CoBRA unit — launched a joint operation on 2 April.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X