చోటారాజన్ అరెస్ట్, డి గ్యాంగ్ అసంతృప్తి, లేపేస్తా:షకీల్
ముంబై: చోటా రాజన్ అరెస్టు పైన దావూద్ ఇబ్రహీం అనుచరుడు చోటా షకీల్ స్పందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. చోటా రాజన్ అరెస్టును చోటా షకీల్ అంగీకరించలేకపోతున్నాడని, అతనిని చంపడమే తన లక్ష్యంగా చెప్పాడు.
చోటా రాజన్‌ను ఇంటర్ పోల్ పోలీసులు రెండు రోజుల క్రితం ఇండోనిసియాలోని బాలిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై చోటా షకీల్ స్పందించాడు. ఎక్కడున్నా అతనిని చంపడమే తన లక్ష్యమని షకీల్ చెప్పాడు.

ఫిజిలో గత వారం తమ అనుచరులు అతనిని టార్గెట్ చేశారని, దీంతో ఇండోనేసియా పారిపోయాడని చోటా షకీల్ చెప్పాడు. దీంతో, అతను అరెస్టయ్యాడని చెప్పాడు. ఛోటా రాజన్ అరెస్టుతో డి కంపెనీ (దావూద్ ఇబ్రహీం అండ్ కో) సంతోషంగా లేదని, అతనిని చంపడమే తమ లక్ష్యమని చెప్పాడు.
చోటా రాజన్‌ను లేపేయడమే తన లక్ష్యమని, అప్పటి వరకు తాను ఊరుకోనని చెప్పాడు. అతనిని భారత్ తరలించినా తాను అతనిని టార్గెట్ చేస్తానని చెప్పాడు. భారత్ ప్రభుత్వం తమను పట్టుకునేందుకు అతని సహాయం తీసుకోవచ్చునని అభిప్రాయపడ్డాడు.












Click it and Unblock the Notifications