వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు సీఎస్, డీజీపీ అత్యవసర సమావేశం: గవర్నర్ ఏం చెప్పారు !

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్ సోమవారం సెక్రటేరియట్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వివిద అంశాలపై చర్చించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్ సోమవారం సెక్రటేరియట్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వివిద అంశాలపై చర్చించారు. ఈ సందర్బంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు, పోలీసు అధికారులు పలు విషయాలపై చర్చించారు.

జయలలిత మేనకోడలు దీపాకు మంత్రి పదవి ! శశికళ పని ఫినిష్జయలలిత మేనకోడలు దీపాకు మంత్రి పదవి ! శశికళ పని ఫినిష్

సోమవారం సెక్రటేరియట్ లో సమావేశం అయిన తమిళనాడు సీఎస్ గిరిజా వైద్యనాథన్, డీజేపీ రాజేంద్రన్ అనేక విషయాలపై క్షుణ్ణంగా చర్చించారని తెలిసింది. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల కారణంగా శాంతి భద్రతలు అదుపుతప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిసింది.

Chief Secretary Girija Vaidyanathan holds emergency meeting with DGP Rajendran in Secretariat today.

ఈ విషయంలో అధికారులకు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చెయ్యాలని సీఎస్ గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్రన్ నిర్ణయించారని ఉన్నతస్థాయి అధికారులు తెలిపారు. అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సెక్రటేరియట్ వెళ్లిన సమయంలో గిరిజా వైద్యనాథన్, రాజేంద్రన్ అక్కడే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యేలు గోడ దూకేస్తున్నారు: పన్నీర్, శశికళ ఎత్తులు పై ఎత్తులుఎమ్మెల్యేలు గోడ దూకేస్తున్నారు: పన్నీర్, శశికళ ఎత్తులు పై ఎత్తులు

తరువాత పన్నీర్ సెల్వంతో సీఎస్ గిరిజా వైద్యనాథన్, డీజేపీ రాజేంద్రన్ భేటీ అయ్యారని తెలిసింది. తమిళనాడులో అల్లరిమూకలు గొడవలు సృష్టించే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో సీఎస్, డీజేపీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చించారని సమాచారం.

తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ వర్గీయులు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్న సమయంలో గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు సూచన మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యరదర్శి, డీజేపీ అత్యవసర సమావేశం అయ్యారని తెలిసింది.

English summary
Tamil Nadu Chief Secretary Girija Vaidyanathan holds emergency meeting with TN DGP Rajendran in Secretariat today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X