షాక్: ఇండియా డ్రోన్ కూల్చివేసిన చైనా, కారణమిదే

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తమ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన భారత్‌కు చెందిన డ్రోన్‌ను కూల్చేశామంటూ ఆ దేశ మీడియా గురువారం వెల్లడించింది. 'భారత్‌ చర్య చైనా ప్రాదేశిక సార్వభౌమాత్వాన్ని ఉల్లంఘించేలా ఉందని చైనా మీడియా అభిప్రాయపడింది.

డోక్లామ్ ఉద్రిక్తతల తర్వాత చైనా, ఇండియాల మధ్య మరోసారి డ్రోన్ కూల్చివేత ఘటన కలకలాన్ని రేపుతోంది. చైనా, ఇండియాల మధ్య డోక్లామ్ వివాదాన్ని రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకొన్నాయి.

షాక్: రంగు మారిన సియాంగ్ నీరు, మృత్యువాత పడ్డ చేపలు, ఎందుకంటే?

అయితే డోక్లామ్ వివాద సమయంలో రెండు దేశాల సైనికులు పరస్పరం దాడులకు కూడ దిగారు.అయితే ఈ పరిస్థితిని రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకొన్నాయి. అయితే మరోసారి డ్రోన్ కూల్చివేత వ్యవహరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచే అవకాశం లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు.

ఇండియా డ్రోన్‌ను కూల్చేసిన చైనా

ఇండియా డ్రోన్‌ను కూల్చేసిన చైనా

తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇండియా డ్రోన్‌ను కూల్చేశామంటూ చైనా ప్రకటించింది. ఈ మేరకు చైనా మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. తమ అనుమతి లేకుండా మా భూభాగంలోకి రావడానికి ఎలా సమ్మతిస్తామని ఆ దేశం ప్రకటించింది. ఈ విషయమై చైనా మీడియా గురువారం నాడు వెల్లడించింది.ఈ విషయాన్ని జిన్హుహ మీడియా ప్రకటించింది.

 డ్రోన్ ఎప్పుడు కూల్చారు

డ్రోన్ ఎప్పుడు కూల్చారు

తమ గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్‌ పట్ల తాము వృత్తిపరమైన దృక్పథంతో వ్యవహరించి.. దాని గుర్తింపు వివరాలు సేకరించామని చైనా ఆర్మీ వెస్టర్న్‌ థియేటర్‌ కొంబాట్‌ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌ ఝాంగ్‌ షుయిలి ప్రకటించారు. అయితే ఈ డ్రోన్ ఎప్పుడు చైనా భూభాగంలోకి ప్రవేశించింది. ఎప్పుడు ఈ డ్రోన్‌ను పేల్చివేశారనే విషయమై చైనా స్పష్టం చేయలేదు.

 తీవ్ర అసంతృప్తి

తీవ్ర అసంతృప్తి

తమ భూభాగంలోకి అనుమతి లేకుండా ఇండియాకు చెందిన డ్రోన్‌ రావడం పట్ల చైనా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ విషయమై చైనా ఆర్మీ వెస్టర్న్‌ థియేటర్‌ కొంబాట్‌ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌ ఝాంగ్‌ షుయిలి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని చైనా మీడియా ప్రకటించింది.

 డోక్లామ్ ఉదంతం తర్వాత

డోక్లామ్ ఉదంతం తర్వాత

డోక్లామ్ ఉదంతం తర్వాత చైనా, ఇండియాల మధ్య డ్రోన్ కూల్చివేత ఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే రెండు దేశాలు డోక్లామ్ ఉదంతాన్ని ఏ తరహలో శాంతియుతంగా పరిష్కరించుకొన్నాయో అదే తరహలో ఈ తరహ సమస్యలను పరిష్కరించుకొనే అవకాశం ఉందని కూడ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An Indian drone has "invaded" China's airspace and crashed, Chinese state media said Thursday, months after the neighbours ended one of their worst border standoffs in decades.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి