వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డోక్లామ్ సమస్యకు త్వరలోనే చెక్ పెట్టనున్న చైనా: రాజ్‌నాథ్‌సింగ్

చైనాతో డోక్లామ్ సరిహద్దు సమస్య త్వరలోనే తెరపడనుంది.కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం నాడు ప్రకటన.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డోక్లామ్ ప్రతిష్టంభనకు తెరపడేలా త్వరలోనే చైనా ముందుకు వచ్చే అవకాశం ఉందని కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభిప్రాయపడ్డారు.

సిక్కిం సరిహద్దు వెంట ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి సమసిపోయేలా సంప్రదింపుల ప్రక్రియకు చైనా చొరవ చూపుతోందని సోమవారం నాడు రాజ్‌నాథ్‌సింగ్ అభిప్రాయపడ్డారు.

China will make a positive move, says Rajnath Singh on Doklam standoff

భారత్ శాంతినే కొరుకొంటుందనే సందేశాన్ని పొరుగుదేశాలకు తాము చాటుతున్నట్టు రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు.డోక్లామ్‌పై మూడు మాసాలుగా భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

రెండు దేశాలు పరస్పరం హెచ్చరికలు చేసుకొంటున్నాయి. ఈ తరుణంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.భారత్‌తో వాణిజ్య సంబంధాలు నెరపడం, ఆర్థికశక్తిగా అమెరికాకు ధీటుగా ఎదగాలని చైనా భావిస్తున్న తరుణంలో భారత్‌తో దూకుడుగా చైనా వెళ్ళే అవకాశం ఉండదనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

English summary
Union home minister Rajnath Singh on Monday said that he is hopeful that China will soon initiate a dialogue on the ongoing border situation between the two countries in Sikkim. Speaking on Doklam issue, Singh said that,''there will be a solution soon and I am sure China will make a positive move.''
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X