పన్నీర్ హీరో, ఎట్టకేలకు మౌనాన్ని వీడారు, ప్రశంసలు కురిపిస్తోన్న సినీ నటులు
తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి సినీనటులు ప్రశంసలు కురిస్తున్నారు .ఇప్పటికైనా మౌనాన్ని వీడారంటూ ఆయనను అభినందిస్తున్నారు.
చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తొలిసారి నోరువిప్పిన తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై సినీ నటులు ప్రశంసలు కురిపించారు.
దివంగత జయలలిత మరణంపై అనేక అనుమానాలను విపక్షాలు వ్యక్తం చేశాయి. అన్నాడిఎంకె పార్టీకి చెందిన ఎంపి శశికళ జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే ఆమెకు జరుగుతున్న చికిత్సపై అనుమానాలను వ్యక్తం చేశారు.
జయలలిత మరణం తర్వాత కూడ శశికళ ఇదే రకమైన అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే శశికళ పార్టీ పగ్గాలను చేపట్టడంతో పాటు ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు కూడ సిద్దమయ్యారు.
పార్టీ శాసనసభపక్ష నాయకురాలిగా శశికళను అన్నాడిఎంకె పార్టీకి చెందిన ఎంఏల్ఏలు ఎన్నుకొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు వేచిచూసే ధోరణిని అవలంభించడంతో శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఆలస్యమైంది.

పన్నీర్ పై ప్రశంసల జల్లు
తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తొలిసారి నోరువిప్పడంతో సినీ ప్రముఖులు సెల్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ధైర్యంగా మాట్లాడారని సెల్వాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవాలు చెబుతున్నారని ఆయనను మెచ్చుకొంటున్నారు.

మనకంటే ముందే రాజకీయనాయకులు నిద్రలేస్తారు
తమిళనాడు ప్రజలారా త్వరగా పడుకోండి. రాజకీయ వాతావారణం వేడెక్కినందున రాజకీయపార్టీ నాయకులే మన కంటే ముందుగానే నిద్రలేస్తారని ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ చెప్పారు.అంతేకాదు మన స్వాతంత్య్రాన్ని అవినీతి , రాజకీయ నాయకుల కోసం దుర్వినియోగం చేసుకొన్నామని ఆయన అభిప్రాయపడ్డారు.

సినిమాను తలపిస్తున్నాయి
తమిళనాడు రాజకీయాలు హలీవుడ్ సినిమాలను తలపిస్తున్నాయని సినీ నటుడు సిద్దార్థ అభిప్రాయపడ్డారు. గేమ్ ఆఫ్ థోర్న్స్, హౌజ్ ఆఫ్ కార్డ్స్ అనే హలీవుడ్ సినిమాలను సిద్దార్థ్ ప్రస్తావించారు. సినిమాల కంటే రంజుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.మెరీనా బీచ్ లో పన్నీర్ సెల్వం ధ్యానం చేయడాన్ని కూడ ఆయన ప్రస్తావించారు.

ధైర్యంగా మాట్లాడారు
తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ధైర్యంగా మాట్లాడారని సినీ నటుడు ఆర్య అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో ఆయన ధైర్యంగా మాట్లాడడాన్ని ఆయన అభినందించారు.అంతేకాదు పన్నీర్ సెల్వానికి ఆయన హాట్సాప్ చెప్పారు.

పన్నీర్ సెల్వమే హీరో
తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మౌనాన్ని వీడారు. ఒక హీరోగా ముందుకు వచ్చారంటూ సినీ నటి ఖుష్బూ చెప్పారు. ఒక హీరోగా పన్నీర్ సెల్వం ముందుకు వచ్చారని ఆమె కొనియాడారు. డ్రామా ఇప్పుడే మొదలైందన్నారామె. దేశ రాజదానికి చెందిన 56 ఇంచుల ఛాతీ ఉన్న నాయకుడి తరపున పన్నీర్ సెల్వం పనిచేయడం లేదని తాను ఆశిస్తున్నా అంటూ ఆమె చెప్పారు.

పాప్ కార్న్ తింటాను
బఠానీలు తింటూ న్యూస్ చూస్తున్నా...అదే సమయంలోనే పన్నీర్ సెల్వం మౌనాన్ని వీడారని మరో నటుటు అరవింద్ స్వామి అభిప్రాయపడ్డారు. ఓ బఠాణీ పగిలింది. ఇక బఠాణీలు మానివేసి, పాప్ కార్న్ తింటానని చెప్పారు అరవింద్ స్వామి.












Click it and Unblock the Notifications