ట్విట్టర్ ఇండియా హెడ్‌కి సమన్లు, బెదిరింపుతో బెంగళూర్లో హైఅలర్ట్

బెంగళూరు: ఇసిస్ ఉగ్రవాది మెహిదీ మసూద్ బిశ్వాస్ అరెస్ట్ నేపథ్యంలో ట్విట్టర్ ఇండియా మార్కెటింగ్ హెడ్‌కు బెంగళూరు పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. ఈ కేసు విషయంలో తామడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వడంలో ట్విట్టర్ యాజమాన్యం వ్యవహరించిన తీరు ఏమీ బాగోలేదన్నారు.

ఈ కారణంగానే ఆ సంస్థ ఇండియా మార్కెటింగ్ హెడ్‌ను తమ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశామని బెంగళూరు డీసీపీ అభిషేక్ గోయల్ చెప్పారు. నేటి సాయంత్రం 5 గంటలకు ట్విట్టర్ ఇండియా మార్కెటింగ్ హెడ్ తమ ముందు హాజరుకావాల్సిందేనని చెప్పారు.

షమి విట్ నెస్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలివ్వాలని ఐదు రోజుల క్రితం తాము ట్విట్టర్ యాజమాన్యాన్ని కోరామని, అయితే వారు స్పందించిన తీరు ఏమీ బాగోలేదన్నారు. ఇదిలా ఉంటే, తమ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలను వెల్లడించలేమన్న ట్విట్టర్ అధికార ప్రతినిధి, బెంగళూరు పోలీసుల సమన్లపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.

బెంగళూరు సీపీకి బెదిరింపు సందేశాలు

City police summon Twitter India head

కర్నాటక రాజధాని బెంగళూరు పోలీసు కమిషనర్‌కు ఇస్లామిక్ స్టేట్ మీడియా నుండి సోమవారం బెదిరింపు సందేశం వచ్చింది. రేపు (డిసెంబర్ 16, మంగళవారం) బెంగళూరులో భారీ ఎత్తున దాడులు చేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో తాము అప్రమత్తంగా ఉన్నామని బెంగళూరు పోలీసు కమిషనర్ తెలిపారు. బెంగళూరులో హైఅలర్ట్ ప్రకటించారు.

'ఇది కేవలం ప్రారంభం మాత్రమే. తాము మంగళవారం నాడు పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపడతాం. షమీకి మద్దతుగా దీనిని చేపడతామ'ని హెచ్చరికలు జారీ చేశారు.

కాగా, సిరియాకు చెందిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఇసిస్) ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్నాడన్న ఆరోపణల పైన మెహిదీ మసూద్ బిశ్వాస్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టు నేపథ్యంలో బెంగళూరు టాప్ పోలీసు బాసుకు ట్విట్టర్ అకౌంటులో బెదిరింపు మెసేజ్ వచ్చింది.

దీనిపై బెంగళూరు నగర పోలీసులు కమిషనర్ ఎమ్మెన్ రెడ్డి ఆదివారం స్పందించారు. ఆ మెసేజ్ ఎక్కడి నుండి వచ్చిందో గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. డీసీపీ(క్రైమ్) అభిషేక్ గోయల్‌కు ఆ సందేశం వచ్చింది.

ట్విట్టర్ ఎకౌంట్ ఎవరైనా ఓపెన్ చేయవచ్చునని, అలాగే ఎక్కడి నుండి అయినా పోస్ట్ చేయవచ్చునని కమిషనర్ ఎమ్మెన్ రెడ్డి చెప్పారు. అది ఎక్కడి నుండి వచ్చిందో గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, గోయల్ ట్విట్టర్ అకౌంటుకు బెదిరింపు సందేశం వచ్చింది.

అందులో.. మా సోదరులను మీ చేతులలో వదిలే ప్రసక్తి లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని, మా ప్రతిస్పందనకు వేచి చూడాలని అందులో హెచ్చరించారు. మెహిదీ మసూద్ బిశ్వాస్ అరెస్టు నేపథ్యంలో ఈ సందేశం వచ్చింది. దీనిపై గోయల్ స్పందిస్తూ.. ఈ మెసేజ్‌ను తాను తీవ్రంగా పరిగణించడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+