bengalలో మళ్లీ పేట్రేగిన హింస -బాంబులు విసురుకున్న ఇరు వర్గాలు -హుగ్లీ జిల్లా చందన్‌నగర్‌లో టెన్షన
పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తారా స్థాయికి వెళ్లి, ఫలితాల అనంతరం కూడా కొనసాగి, కేంద్ర, రాష్ట్రాల వినతుల తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన హింస మళ్లీ పేట్రేగింది. ఈసారి రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల వివరణ ప్రకారం.. హుగ్లీ జిల్లాలోని చందన్ నగర్ లో బుధవారం రాత్రి నుంచి ఘర్షణలు మొదలయ్యాయి. నగరంలోని లిచూపట్టీలో నివసించే ఓ వర్గం.. ఉర్దూ బజార్ కు చెందిన మరో వర్గం మధ్య తలెత్తిన చిన్న గొడవ కాస్తా అల్లర్లకు దారితీసింది.

చందన్ నగర్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఒకరిపై ఒకరు రాళ్లు, ఇటుకలతో దాడులు చేసుకున్నారు. ఆ ప్రాంతమంతా యుద్ధవాతావరణాన్ని తలపించగా, పోలీసుల రంగప్రవేశం తర్వాత మూకలను చెదరగొట్టారు. పోలీసుల కథనం ప్రకారం రెండు వర్గాలు పరస్పరం నాటు బాంబులు కూడా విసురుకున్నారు. మొత్తం ఆరు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మూకలు వీధుల్లోకి వచ్చి కనిపించిన వాహనాలను ధ్వసం చేశాయి. అల్లర్ల సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ యంత్రాంగం భారీ ఎత్తున మోహరించింది. అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అల్లర్లలో ఇప్పటిదాకా ఎవరికైనా గాయాలైంది లేనిది తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
బెంగాల్ ఎన్నికల సందర్భంలో, ఆ తర్వాతా అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హింస, దాడులు, ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షనేత, బీజేపీ ఫ్లోర్ లీడర్ సువేందు అధికారిపై ఏకంగా దొంగతనం కేసు నమోదైంది. మమత సర్కార్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తోన్న సువేందు.. బుధవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కాగా, హుగ్లీ అల్లర్లకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.
Recommended Video
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications