టీవీ చూస్తుంటే కొట్టారు: అమ్మాయి ఆత్మహత్య

చదువుకోకుండా టీవీ చూస్తున్నావంటూ తల్లిదండ్రులు కొట్టడంతో మనస్తాపానికి గురైన 16 ఏళ్ల అమ్మాయి కుమారి రమాకిషన్ ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని ఎలిఫెంట్ గేట్‌లో గల పెరుమాళ్ కోయిల్ తొట్టంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.
దుపట్టాతో తన పడకగదిలో కుమారి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పారు. సాయంత్రం వరకు కూడా అమ్మాయి తన గదిలోంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు.
పైకప్పునకు దుపట్టాతో ఉరేసుకున్న కూతురిని చూసి వారు తల్లడిల్లిపోయారు. పోస్టు మార్టం కోసం అమ్మాయి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications