గడ్డంలేని మోడీ బావుంటారు, రజనీ ఎలాగైనా: చిత్రాంగద
ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గడ్డం లేకుండా ఉంటే ఎంతో బాగుంటారని ప్రముఖ నటి చిత్రాంగద సింగ్ అన్నారు. చిత్రాంగద జిల్లెట్ సంస్థ ఏర్పాటు చేసిన 'అన్ షేవెన్ ఈజ్ అన్‌బాత్‌డ్' (గడ్డం చేసుకోకుంటే స్నానం చేయనట్లే) కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మోడీ క్లీన్ షేవ్‌లో బాగుంటారని అభిప్రాయపడింది. మగవాళ్లు గడ్డం తీసేస్తే ఎంతో బాగుంటారని చెప్పింది. గడ్డంతో గల వ్యక్తులు అంత అట్రాక్టివ్‌గా కనిపించరంది. అయితే కొన్ని మతాల సంప్రదాయం ప్రకారం వారికి గడ్డం తప్పనిసరి కావొచ్చని ఆమె చెప్పింది. గడ్డం ఉన్నా లేకున్నా నటుల్లో రజనీకాంత్ అంటే తనకు చాలా ఇష్టమంది.
కాగా, హాట్ బ్యూటీ మల్లికా శెరావత్ రెండు నెలల క్రితం నరేంద్ర మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17న మోడీ జన్మదినం. దీంతో ఆ రోజు ఆమె మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications