మరో రెండు నెలల్లో అక్కడ రూ.1కే కార్పొరేట్ వైద్యం
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఐదు మెట్రో రైల్వేస్టేషన్లలో కేవలం రూపాయికి వైద్యం అందించే ఆస్పత్రులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కార్పొరేట్ వైద్యం అంటేనే లక్షల్లో ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో రూ. 1కే వైద్యం అందించేందుకు ఈ ఆస్పత్రులు ముందుకు రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆస్పత్రుల్లో ఎంబీబీఎస్ వైద్యులతో వైద్య సేవలు అందిస్తుండటం గమనార్హం. ప్రతీ రోజూ 24గంటలపాటు వైద్య సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి ఈ ఆస్పత్రులు. ఈ ఆస్పత్రుల్లో చిన్నవ్యాధి నుంచి అత్యవసర చికిత్స వరకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.

అంతేగాక, ఈ ఆస్పత్రుల్లో 24గంటలపాటు ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో ఉంటారు. అవసరమైతే ఛర్మ వ్యాధులు, డయాబెటీస్, ప్రసూత స్పెషలిస్టులు కూడా వస్తుంటారని చెబుతున్నారు. అంతేగాక, ఏవైనా పరీక్షలు చేయించుకున్నా, మందులు కొనుగులో చేసినా ఇక్కడ అత్యంత తక్కువ ధరకే లభించనున్నాయి.
కాగా, ఈ ఆస్పత్రులు ముంబైలోని 5మెట్రో స్టేషన్ల వద్ద మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. కుర్లా, ఘట్‌కోపర్, ములంద్, వదాల, దాదార్ స్టేషన్లలో ఈ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నారు. ముంబైకి చెందిన వైద్యులు రాహుల్ ఘూలె, అమోల్ ఘూలెలు ఈ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, ఈ ఆస్పత్రుల ఏర్పాటు కోసం రైల్వే శాఖ ఉచితంగా స్థలాలను అందజేసింది.












Click it and Unblock the Notifications