తీహార్ జైల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ప్రాణహాని; అలెర్ట్ అయిన గార్డ్స్!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ కు పాల్పడ్డారని అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి ఈడి అధికారులు ఈ కేసును విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అరవింద్ కేజ్రివాల్ ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ మీద తీహార్ జైల్లో ఉన్నారు. అరవింద్ కేజ్రివాల్ ను తీహార్ జైల్లో జైలు నెంబర్ 2లో ఉంచారు.
అరవింద్ కేజ్రీవాల్ కు హాని.. అలెర్ట్ అయిన గార్డ్స్
అయితే అరవింద్ కేజ్రీవాల్ జైల్లో సేఫ్ జోన్ లో లేరు అన్న వ్యక్తమవుతున్నాయి. జైల్లో ఆయనకు ఏమైనా జరగొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆప్ నేతలు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అనుమానాలకు తగ్గట్టు అరవింద్ కేజ్రీవాల్ కు కొంత మంది ఖైదీలు హాని కలిగించే ప్రయత్నం చేస్తారని, కేవలం హైలైట్ కావడం కోసమే వారు అరవింద్ కేజ్రీవాల్ కు హాని చేసే అవకాశం ఉందని జైలు అధికారులకు ఇన్పుట్ లు రావడంతో తీహార్ జైలులోని గార్డులు వెంటనే అప్రమత్తమయ్యారు.

కేజ్రీవాల్ సెల్ కు భద్రత పెంపు
అరవింద్ కేజ్రీవాల్ ఉన్న సెల్ కు భద్రతను మరింత పెంచారు. అరవింద్ కేజ్రీవాల్ ఉన్న తీహార్ లోని జైలు నెంబర్ రెండు సేఫ్ కాదు అని చెప్పడానికి గతంలో జరిగిన ఒక ఉదంతం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. 2021లో ఈ జైలు కాంప్లెక్స్ లో జరిగిన గ్యాంగ్ వార్ సమయంలో శ్రీకన్ రామస్వామి అనే ఖైదీ హత్యకు గురయ్యారు.
జైలు నెంబర్ 2లో గ్యాంగ్ వార్.. ఒకరు హత్య
ఢిల్లీలోని అశోక్ విహార్ కి చెందిన రామస్వామి 2015లో ఒక హత్య కేసులో అరెస్టయ్యాడు. 2021 మే 14వ తేదీన ఉదయం తీహార్ జైలులో ఉన్న అతనిని జైలు కాంప్లెక్స్ లో జరిగిన గ్యాంగ్ వార్ లో హతమార్చారు. నలుగురు అండర్ ట్రయల్ ఖైదీలు క్రికెట్ బ్యాట్ లతో నేరస్తుడిని కొట్టారని, దీంతో రామస్వామి మృతి చెందారని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు.

జైలు కాంప్లెక్స్ లో హత్యపై సీబీఐకి కేసు బదలాయింపు
పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే కోర్టు ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసింది. అంతేకాదు జైల్లో ఆకస్మిక తనిఖీలు జరిపిన సమయంలో 33 మొబైల్ ఫోన్లను తీహార్ జైలు పరిపాలనా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
జైలు నెంబర్ 2 .. క్రిమినల్ హిస్టరీ ఉన్న కాంప్లెక్స్
ఈ క్రమంలో తీహార్ జైలులో జైలు నెంబర్ రెండు కు ఉన్న పాస్ట్ హిస్టరీ నేపథ్యంలో వ్యక్తమవుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ కు అక్కడ ఎవరైనా హాని తలపెట్టే అవకాశం ఉండొచ్చని, కేవలం పాపులర్ అవ్వడం కోసం ఎవరైనా అరవింద్ కేజ్రీవాల్ పై దాడి చేయొచ్చని అనుమానిస్తున్నారు. ఇదే క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ సెల్ పక్క సెల్ లలో కరడుగట్టిన నేరగాళ్ళు ఉన్నారు.












Click it and Unblock the Notifications