• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మమత పద్దతి మహిళలకూ నచ్చట్లేదు... కావాలని పదేపదే అలా.. వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించుకున్న ఘోష్

|

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చీర కట్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్... తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను మమతా బెనర్జీని అవమానించలేదని... మమతా బెనర్జీయే బెంగాల్ సంస్కృతిని అవమానిస్తోందని అన్నారు. కాళ్లు కనిపించేలా చీర కట్టుకుని ఆమె బెంగాల్ సంస్కృతిని అవమానపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాజాగా ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంగా దిలీప్ ఘోష్ మరోసారి మమతను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు.

మమతా చీరకు బదులు బెర్ముడా షార్ట్స్ ధరించాలి... బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి షాకింగ్ కామెంట్స్...

మమత పద్దతి మహిళలకు కూడా నచ్చట్లేదు : దిలీప్ ఘోష్

మమత పద్దతి మహిళలకు కూడా నచ్చట్లేదు : దిలీప్ ఘోష్

'పశ్చిమ బెంగాల్‌లో మన తల్లులు,అక్కాచెల్లెళ్లు చీరలు ధరిస్తారు. చీర అనేది గౌరవ,మర్యాదపూర్వకమైన ప్రతీక. కానీ కొంతమంది బహిరంగ సభల్లో... చీర కట్టులో పదేపదే కావాలని తమ కాళ్లు చూపిస్తున్నారు.. ఇది సరైనది కాదు. ఇలా వ్యవహరించడం మహిళలకు కూడా నచ్చడం లేదు. కాబట్టే... ఇది బెంగాల్ సంస్కృతి కాదని నేను ప్రశ్నించాను. ముఖ్యమంత్రి బెంగాల్ సంస్కృతి గురించి చాలా మాట్లాడుతారు... అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేం...' అని దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు.

అవమానించినట్లు కాదు... నిరసన...

అవమానించినట్లు కాదు... నిరసన...

'నా వ్యాఖ్యలు మహిళలను అవమానించినట్లు కాదు. మన సంస్కృతిని అవమానిస్తున్న మమతా బెనర్జీ తీరుపై ఒక బహిరంగ సభలో నా వ్యాఖ్యలతో నిరసన వ్యక్తం చేశారు. అందులో వివాదానికి తావు లేదు. వివరణ ఇవ్వాల్సిన పనిలేదు.' అని దిలీప్ ఘోష్ స్పష్టం చేశారు. కాలికి గాయమైందన్న సాకుతో ప్రజల్లో సానుభూతి పొందేందుకు మమత ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కానీ జనం ఆమెను నమ్మేందుకు సిద్దంగా లేరని... మహిళా ఓటర్లు మమతా విధానాలతో విసిగిపోయి ఉన్నారని చెప్పారు.

టీఎంసీని ఊడ్చిపడేస్తామన్న ఘోష్...

టీఎంసీని ఊడ్చిపడేస్తామన్న ఘోష్...

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదేనని... ప్రధాని నరేంద్ర మోదీ,సీనియర్ బీజేపీ నేతల ర్యాలీలకు జనం భారీగా తరలివస్తుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రతీ ర్యాలీలో మహిళా ఓటర్లు భారీగా తరలివస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ పాలన వస్తుందని వారు బలంగా నమ్ముతున్నారని... ఈసారి టీఎంసీని రాష్ట్రంలో పూర్తిగా ఊడ్చి పడేస్తామని చెప్పారు. 294 అసెంబ్లీ సీట్లకు గాను 200 సీట్లు తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

పురులియా సభలో వివాదాస్పద వ్యాఖ్యలు

పురులియా సభలో వివాదాస్పద వ్యాఖ్యలు

బుధవారం(మార్చి 24) పురులియా పట్టణంలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల సభలో దిలీప్ ఘోష్ మమత చీర కట్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే... ఒక కాలు బయటకు కనిపించేలా... మరో కాలు కనిపించకుండా ఆమె చీర కట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. గాయమైన కాలిని ప్రజలకు చూపించడం ద్వారా సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నట్లుగా ఆయన మాట్లాడారు. అంతేకాదు,ఒకవేళ మమతా బెనర్జీ జనానికి తన కాళ్లు చూపించాలనుకుంటే... చీరకు బదులు బెర్ముడా షార్ట్స్ ధరించాలని సూచించారు. ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీఎంసీ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
In West Bengal, our mothers and sisters wear saree. Saree is a symbol of decency. But it is not proper that someone deliberately shows her foot — again and again in public meetings — while wearing a saree. Even women are not liking this. I have questioned this…it does not seem proper in Bengal’s culture. The CM speaks a lot about Bengali culture…We do not expect such behaviour from the CM,” Ghosh told
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X