సుప్రీంకోర్టు చరిత్రలో అపూర్వం- కీలక కేసు కోసం లాయర్ అవతారం ఎత్తిన మమత బెనర్జీ

దేశ అత్యున్నత న్యాయస్థానంలో నేడు ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టు న్యాయవాది అవతారం ఎత్తారు. అత్యంత వివాదాస్పదంగా మారిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ (SIR)' కేసులో స్వయంగా తన వాదనలను వినిపిస్తోన్నారు. దీనికోసం కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. దేశ చరిత్రలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి స్వయంగా కోర్టులో వాదించడం ఇదే తొలిసారి. ఆమె ఎల్ఎల్బీ చదివారు.

సర్ పిటీషన్లపై వాదనల విషయంలో 'పార్టీ ఇన్ పర్సన్'గా హాజరు కావడానికి మమత బెనర్జీ దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అనుసరిస్తోన్న వైఖరిని సవాల్ చేస్తూ స్వయంగా వాదిస్తోన్నారు. ఆమె దాఖలు చేసిన ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ పాంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తోంది.

CM Mamata Banerjee to Argue in Person at the Supreme Court A Historic Moment for Indian Justice

ఈసీ అవలంభిస్తోన్న అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడలను మమత బెనర్జీ బహిర్గతం చేస్తారని తృణమూల్ కాంగ్రెస్ చెబుతోంది. పశ్చిమ బెంగాల్ లో ఓటర్ల తొలగింపును నిలిపివేయాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు. ప్రస్తుత ఎస్ఐఆర్ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నెల 14వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల కావాల్సి ఉందని, 60 లక్షలకు పైగా విచారణలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయడానికి నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని చెబుతున్నారు మమత బెనర్జీ.

జనవరి 19న సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిందనేది ఆమె ప్రధాన ఆరోపణ. ఓటర్ల ఇంటి/ముందు పేర్లలో వ్యత్యాసాలున్న కేసులకు తప్పనిసరి విచారణ అవసరం లేదని ఈసీ హామీ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత చిన్నపాటి తేడాలకు కూడా తప్పనిసరి విచారణలు జరపాలని సర్క్యులర్‌లు జారీ చేసిందని ఆమె ఆరోపించారు. లాజికల్ డిస్‌క్రెపెన్సీ కింద వేలాది కేసులను పునర్వర్గీకరించగా వాటిని మ్యాప్ చేయని ఓటర్ల జాబితాలను కారణాలు, షెడ్యూల్ లేకుండా ప్రచురించినట్లు తెలిపారు.

లాజికల్ డిస్‌క్రెపెన్సీ కిందకు వచ్చే పేరు వ్యత్యాసాలు లేదా అక్షర దోషాలు.. సుమారు 50 శాతం లేదా 70 లక్షల కేసులకు పైగా ఉన్నప్పటికీ, విచారణకు పిలవకుండానే అందుబాటులో ఉన్న రికార్డులు లేదా ఆధార్ ఆధారంగా సుమోటోగా సరిదిద్దాలని మమత బెనర్జీ సూచించారు. ఎన్నికల సంఘం, జాబితాలు ప్రచురితమైన అన్ని స్థాయిల్లో ఓటర్లను లాజికల్ డిస్‌క్రెపెన్సీ కింద ఎందుకు గుర్తించారో, వారి విచారణల షెడ్యూల్‌ను బహిర్గతం చేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+