సీఎం ఫ్లయింగ్ కిస్: మరో వివాదంలో శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల వరుసగా వివాదాల్లో నానుతున్నారు. అమెరికా కంటే మధ్యప్రదేశ్ రోడ్లే బాగున్నాయంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన..
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల వరుసగా వివాదాల్లో నానుతున్నారు. అమెరికా కంటే మధ్యప్రదేశ్ రోడ్లే బాగున్నాయంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా ఓ కార్యక్రమంలో 'ఫ్లయింగ్ కిస్'తో వార్తల్లో నిలిచారు.
మధ్యప్రదేశ్ లోని ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా.. అక్కడి ప్రజలకు అభివాదం చేస్తూ.. 'ఐ లవ్యూ' అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. సీఎం ఫ్లయింగ్ కిస్ వ్యవహారం ఇంటర్నెట్ లోకి ఎక్కడంతో నెటిజెన్స్ సెటైర్స్ వేస్తున్నారు.

'మామాజీ.. ఐ టూ లవ్యూ' అని కొంతమంది కామెంట్ చేశారు. ఇక అమెరికా కంటే మధ్యప్రదేశ్ రోడ్లే బెటర్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సైతం నెటిజెన్స్ సెటైర్స్ వేస్తున్నారు.గుంతలమయంగా ఉన్న రోడ్లను అమెరికావిగా, సరిగా ఉన్న రోడ్లను మధ్యప్రదేశ్ రహదారులుగా చూపిస్తూ ఫోటోలు పెట్టారని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications