కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్: సీఎం సిద్ధరామయ్య ఆఫీస్‌కి తాళం

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయం దాదాపు ఖరారైనట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయానికి తాళాలు వేయడం కనిపించింది.

కర్నాటక ఎన్నికల ఫలితాలు: ఎప్పటికప్పుడు... మరిన్ని వివరాల ఇక్కడ చూడండి

అంతేగాక, సిద్ధరామయ్య ఇప్పటికే చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ స్థానంలో జేడీఎస్ అభ్యర్థి జేటీ దేవెగౌడ గెలుపొందారు. అయితే, బాదామిలో హోరాహోరీగా సాగిన పోరులో మాత్రం సిద్ధరామయ్య విజయం సాధించారు.

CM Siddharamahaih;s office in Vidan Saouda secretarial getting closed

బాదామిలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములు.. సిద్ధరామయ్యకు తీవ్రమైన పోటీ ఇచ్చారు. నువ్వానేనా అన్నట్లు సాగినా చివరికు సిద్ధరామయ్య గెలుపొందడం ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చే విషయంగా చెప్పవచ్చు.

బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలుండటంతో సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నారు. కాగా, పార్టీ ఓటమిపై చర్చించేందుకు కాంగ్రెస్ పెద్దలు గులాం నబీ అజాద్, అశోక్ గెహ్లాట్, మల్లిఖార్జున ఖర్గే, తదితరులు సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+