CM: కర్ణాటక సీఎం, మాజీ సీఎంను కలిసిన టీటీడీ చైర్మన్, బెంగళూరులో ప్రముఖ ఆలయంలో పూజలు !

బెంగళూరు/ తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, ఆ రాష్ట్రా మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను కలిశారు. బెంగళూరు చేరుకున్న టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, ఆ రాష్ట్రా మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను వారివారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, మాజీ సీఎం బీఎస్. యడియూరప్పకు శ్రీవారి తీర్థ, ప్రసాదాలు, శ్రీవెంకటేశ్వరస్వామి వారి చిత్రపటాలు అందించి వారిని శాలువతో సత్కరించారు.

 సీఎం, మాజీ సీఎంలను కలిసిన టీటీడీ చైర్మన్

సీఎం, మాజీ సీఎంలను కలిసిన టీటీడీ చైర్మన్

టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి శుక్రవారం బెంగుళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్, మాజీ సీఎం బీఎస్. యడియూరప్పకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తీర్థ, ప్రసాదాలను అందించి శాలువతో సత్కరించారు.

 టీటీడీ చైర్మన్ కు సన్మానం

టీటీడీ చైర్మన్ కు సన్మానం

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఇదే సందర్బంలో టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డిని శాలువతో సత్కరించారు. ఈ సందర్బంగా సీఎం బసవరాజ్ బోమ్మయ్ వైవీ, సుబ్బారెడ్డిని తిరుమల సమాచారం, భక్తులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఇదే సందర్బంలో కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కూడా టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డిని శాలువతో సత్కరించి సన్మానించారు.

వైవీ సుబ్బారెడ్డి వెంట నాయకులు

వైవీ సుబ్బారెడ్డి వెంట నాయకులు

టీటీడీ చైర్మెన్ వైవీ, సుబ్బారెడ్డి వెంట, నెల్లూరు జిల్లా కావలి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, బెంగళూరులోని కేఆర్ పురం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు నందీశ్ రెడ్డి, బెంగళూరులోని వైఎస్ఆర్ సీపీ, బీజేపీ నాయకులు తదితరులు కర్ణాటక సీఎం బసరాజ్ బోమ్మయ్, మాజీ సీఎం బీఎస్. యడియూరప్పను మర్యాదపూర్తకంగా కలిశారు.

 ప్రముఖ ఆలయంలో పూజలు చేసిన టీటీడీ చైర్మన్

ప్రముఖ ఆలయంలో పూజలు చేసిన టీటీడీ చైర్మన్

బెంగళూరు నగరంలోని మారతహళ్లి సమీపంలోని దొడ్డనక్కుందిలోని ప్రముఖ శ్రీకోదండరామస్వామి ఆలయంలో టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దొడ్డనక్కుంద లోని శ్రీ కోదండ రామ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కర్ణాటక సంప్రదాయబద్దంగా మైసూరు పేటా తో సత్కరించి శాలువ కప్పి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, బెంగళూరు బీజేపీ మాజీ ఎమ్మెల్యే నందీష్ రెడ్డి, వయ్యాలికావెల్ లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ నిర్వహకులు పాల్గొన్నారు. బెంగళూరులో టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డిని వైఎస్ఆర్ సీపీ నాయకులతో పాటు తెలుగు ప్రముఖులు కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+