దీపావళికి తీపికబురు ఇచ్చిన సీఎం విజయ్

దీపావళి పండుగ సమీపించిన వేళ.. ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం.. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు తీపికబురు అందించింది. వారికి డిజిటల్ పరిజ్ఞానాన్ని మరింత చేరువ చేయడానికి ఓ భారీ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. వెట్రి ల్యాప్‌టాప్ పథకం (Vetri Laptop Scheme) అమలు కోసం 2,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి విజయ్ పరిపాలనా అనుమతులను ఇచ్చారు.

దీనికింద 2026-2027 విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఆర్ట్స్ అండ్ సైన్స్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, వైద్యం, పశువైద్యం, మత్స్యశాఖ, వ్యవసాయం, న్యాయ విద్య వంటి వివిధ విభాగాల్లో చేరిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం డిగ్రీ, డిప్లొమా విద్యార్థులందరికీ ఈ వెట్రి స్కీమ్ కింద ఉచిత ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయనున్నారు.

CM Vijay Orders implementation of the Vetri Laptop Scheme Rs 2000 Crore Allocation College Students

2025-2026 విద్యా సంవత్సరంలో అమలు చేసిన ల్యాప్‌టాప్ పథకంలో కొన్ని కారణాల వల్ల లబ్ది పొందలేకపోయిన విద్యార్థులకు కూడా ల్యాప్ టాప్ లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ప్రస్తుతం మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్న వృత్తి విద్యా కోర్సుల వారిని కూడా ఈ విడత లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. అర్హులైన సీనియర్ విద్యార్థులందరికీ కూడా ఈ ఉచిత ల్యాప్‌టాప్‌లు అందనున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు- జడ్జిమెంట్
ప్రభుత్వ ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు- జడ్జిమెంట్

విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ల్యాప్‌టాప్‌ల నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యార్థులు సంక్లిష్టమైన ప్రాజెక్టులు, సాఫ్ట్‌వేర్ శిక్షణ పొందడానికి వీలుగా ఇంటెల్ కోర్ ఐ5 (Intel Core i5) లేదా దానికి సమానమైన ప్రాసెసర్‌తో కూడిన ల్యాప్‌టాప్‌లను కేటాయించనున్నారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టే బాధ్యతను ప్రభుత్వం తమిళనాడు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ కు అప్పగించింది.

టీమిండియా బౌలర్ల ప్రతాపం- న్యూజిలాండ్ దాసోహం
టీమిండియా బౌలర్ల ప్రతాపం- న్యూజిలాండ్ దాసోహం

ఈ పథకాన్ని ఎటువంటి జాప్యం లేకుండా, సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయడానికి విజయ్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు కానుంది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలు ప్రక్రియ, నాణ్యత పరిశీలన, సరఫరా, క్షేత్రస్థాయి పంపిణీ అంశాలను ఈ కమిటీ స్వయంగా సమీక్షిస్తుంది. అర్హులైన ప్రతి విద్యార్థికీ సమయానికి అత్యుత్తమ నాణ్యత కలిగిన పరికరం అందేలా చూడటమే దీని ప్రధాన బాధ్యత.

ఆన్‌లైన్ విద్యాబోధన, ఈ-లెర్నింగ్ వనరులను పెంపొందించుకోవడం, స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ పూర్తి చేసుకోవడంలో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ ఉచిత ల్యాప్ టాప్ స్కీమ్ ఎంతగానో ఉపయోపడనుంది. ఆయా కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రపంచస్థాయి పోటీని తట్టుకుని నిలబడేలా చేయడమే ఈ పథకం ఉద్దేశం విద్యార్థుల స్వయం సమృద్ధి, డిజిటల్ సాధికారతకు ఈ వెట్రి ల్యాప్‌టాప్ పథకం ఉపయోగపడుతుందని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+