ఒక్క దెబ్బకు విమర్శకుల నోళ్లు మూయించేసిన విజయ్..! వేల కోట్ల డీల్స్.!

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పై (Vijay) గత కొన్ని రోజులుగా అక్కడి విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ నేతలు వరుసగా విజయ్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీనికి ప్రధాన కారణం విజయ్ లండన్ టూర్. పెట్టుబడుల ఆకర్షణ కోసమంటూ లండన్ కు వెళ్లిన విజయ్.. అక్కడ కాసేపు త్రిషతో, మరికాసేపు తోటి హీరో అజిత్ కారు రేసింగ్స్ వద్ద హల్ చల్ చేస్తూ కనిపిస్తున్నారు. దీంతో విజయ్ లండన్ కు వెళ్లింది పెట్టుబడుల కోసం కాదు జల్సాల కోసమే అంటూ విమర్శలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ విజయ్ జూలు విదిల్చారు.

మోడీ స్వరాష్ట్రంలో బీజేపీకి వరుస షాక్ లు..! అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఓటములు..!
మోడీ స్వరాష్ట్రంలో బీజేపీకి వరుస షాక్ లు..! అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఓటములు..!

ఒకే రోజులో పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. వాటి ద్వారా తమిళనాడుకు పెట్టుబడులతో పాటు ఉద్యోగాల రాకకూ దారులు తెరిచారు. ఈ విషయాన్ని ఆయన టీమ్ స్వయంగా ట్వీట్లు చేస్తోంది. ముందుగా డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, అసెంబ్లీ, లాజిస్టిక్స్ రంగాలలో సుమారు 7,000 ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా వేస్తున్న దాదాపు ₹11,000 కోట్ల పెట్టుబడి కోసం సంవర్ధన మోథర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, గైడెన్స్ తమిళనాడుతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం తమిళనాడులో గ్లోబల్ క్యాపాబిలిటీ సెంటర్లను (GCC) విస్తరించడానికి, స్థాపించడానికి రెండు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాలలో సుమారు వెయ్యి కోట్ల పెట్టుబడి, 2 వేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. వీటితో పాటు స్వీడన్‌కు చెందిన సిగ్మా టెక్నాలజీ గ్రూప్ చెన్నై, తిరుచిరాపల్లిలో 600కు పైగా ఉద్యోగాలను సృష్టించనుంది.

CM Vijay Silences Critics with Major Investment Deals for Tamil Nadu During London Visit
విజయ్ కు ఈసీ బిగ్ న్యూస్- టీవీకే పార్టీ, గుర్తుపై కీలక నిర్ణయం..!
విజయ్ కు ఈసీ బిగ్ న్యూస్- టీవీకే పార్టీ, గుర్తుపై కీలక నిర్ణయం..!

ఈ ఒప్పందాలు జరగడానికి కొన్ని నిమిషాల ముందు వరకూ సీఎం విజయ్ లండన్ లోని సిల్వర్ స్టోన్ పర్యటనపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నాయి. అజిత్ సిల్వర్ స్టోన్ రేస్ కు హాజరయ్యేందుకే విజయ్ లండన్ వెళ్లారని విమర్శిస్తున్నాయి. పెట్టుబడుల ఆకర్షణ కోసమే లండన్ వెళ్లారని చెప్పినా, ఇంతవరకు స్పష్టమైన పెట్టుబడి ఫలితాలు లేదా సమావేశ ఫోటోలు బయటకు రాలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి విమర్శించారు. చివరికి కూటమిలో భాగస్వామి సీపీఎం కార్యదర్సి షణ్ముగం సైతం టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన పెట్టుబడులపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రకటనలు పారదర్శకంగా లేవని విమర్శించారు. ఈ నేపథ్యంలో విజయ్ ఈ ఒప్పందాలు చేసుకున్నారు.

సీఎం పోస్టుకు రాజీనామా-గవర్నర్ కు లేఖ..! మోడీకి థ్యాంక్స్ చెప్పిన అభిజీత్ దిప్కే..!
సీఎం పోస్టుకు రాజీనామా-గవర్నర్ కు లేఖ..! మోడీకి థ్యాంక్స్ చెప్పిన అభిజీత్ దిప్కే..!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+