యూపీనీ ముంచెత్తుతున్న వర్షాలు-అధికారుల్ని అలర్ట్ చేసిన యోగీ ఆదిత్యనాథ్..
ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కన రాష్ట్రాలపై భారీ వర్షాలు విరుచుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వం ఎస్టీఆర్ఎఫ్, ఎన్టీఆర్ఎఫ్ బృందాల సాయంతో పరిస్ధితిని చక్కదిద్దేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సమీక్ష నిర్వహించారు.
ఉత్తర్ ప్రదేశ్ కు పొరుగున ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారుల్ని ఆదేశించారు.భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ సమీక్షా సమావేశంలో.. తాజా పరిస్థితిని యోగీ సమీక్షించారు. ముఖ్యంగా నది కట్టలను పర్యవేక్షించాలని అధికారులను కోరారు. NDRF, SDRF వరద యూనిట్లతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా, ఉత్తరప్రదేశ్‌లోని పలు నదులలో రాబోయే కొద్ది రోజుల్లో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నీటిపారుదల, జలవనరుల శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సూచించారు. కట్టలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. వరదలు లేదా భారీ వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో జాప్యం జరగకూడదని తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన ప్రతి సహాయాన్ని తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదిత్యనాథ్ ఆదేశించారు.
యూపీలో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో మాట్లాడి నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలని అధికారులను సీఎం యోగీ ఆదేశించారు. ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం భారీ వర్షాలు పడ్డాయి. దీంతో నదులు ఉప్పొంగి, నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పొలాలు నీట మునిగిపోయాయి. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో దాదాపు 68 జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఢిల్లీ , ఉత్తరాఖండ్‌లకు ఆనుకుని ఉన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని జిల్లాలు రాష్ట్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications