Cognizant: కాగ్నిజెంట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్- ఈసారి డబుల్..!
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) తమ ఉద్యోగులకు కొత్త ఏడాదిలో గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది ఊహించిన దాని కంటే మెరుగైన ఫలితాలు సాధించిన ఉత్సాహంలో ఉన్న కాగ్నిజెంట్.. ఈ లాభాల్ని తమ ఉద్యోగులకు పంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కీలక ప్రకటన చేసింది. అంతే కాదు దాన్ని అమల్లో కూడాపెట్టేస్తోంది. దీంతో ఉద్యోగులకు డబుల్ ప్రయోజనం అందబోతోంది.
కాాగ్నిజెంట్ ఉద్యోగులకు డబుల్ బోనస్ (Cognizant)
గతేడాది తాము ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు సాధించడంతో తమ రెగ్యులర్ ఉద్యోగులకు ఎప్పుడూ ఇచ్చే 50 శాతం బోనస్ ను కాస్తా రెట్టింపు చేసి 100 శాతం బోనస్ ను ప్రకటించింది. తమ 2025 ఫలితాలు మీ హడావిడి, క్రమశిక్షణతో కూడిన అమలు, మా క్లయింట్‌లు కాగ్నిజెంట్ పట్ల చూపిన నిబద్ధత యొక్క ప్రత్యక్ష ఫలితం అని ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో సీఈవో రవికుమార్ తెలిపారు. ఈ ప్రయత్నాన్ని గుర్తించడానికి, మా విచక్షణా బోనస్ ప్రోగ్రామ్‌కు 100 వద్ద నిధులు సమకూర్చడానికి తాము అధికారం ఇచ్చామని పంచుకోవడానికి సంతోషిస్తున్నట్లు వెల్లడించారు.

బోనస్ వెనుక కీలక కారణం
కాగ్నిజెంట్ తన చివరి పెట్టుబడిదారుల దినోత్సవ ప్రదర్శన ప్రకారం 2027లో తాము పెట్టుకున్న బెంచ్ మార్క్ ను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2025 సంవత్సరానికి దాని ఆదాయం స్థిర కరెన్సీలో 6.4 శాతం పెరిగింది. ఇది దాని సొంత అంచనాలైన 6-6.3 శాతం కంటే మెరుగ్గా ఉంది.అందుకే ఈ రెట్టింపు బోనస్ ఇస్తున్నారు. ఈ బోనస్ శాతం ఏడు సంవత్సరాలలో అత్యధికం. ఇది ఉద్యోగులకు బహుమతులు ఇవ్వడం, నిలుపుకోవడంలో కంపెనీ సామర్థ్యం, ఆసక్తిని సూచిస్తుంది.

అదే టర్నింగ్ పాయింట్
బ్రియాన్ హంఫ్రీస్ కాగ్నిజెంట్ కు నాయకత్వం వహించినప్పుడు వేలాది మంది ఉద్యోగులను కోల్పోయిన తర్వాత, రవికుమార్ నేతృత్వంలో కాగ్నిజెంట్ పని చేయడానికి ఇష్టపడే ప్రదేశంగా దాని ఆకర్షణను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. గతంలో ఉద్యోగుల తొలగింపు రికార్డు స్థాయికి పెరిగింది. కాగ్నిజెంట్ సిబ్బంది కొరత కారణంగా ప్రాజెక్టులను చేపట్టలేకపోయింది. దీంతో స్తబ్దత నెలకొందనే విమర్శలూ ఎదుర్కొంది. కానీ ఇన్ఫోసిస్‌లో సుదీర్ఘ అనుభవజ్ఞుడైన రవి కుమార్ మూడు సంవత్సరాల క్రితం బోర్డులోకి వచ్చినప్పటి నుండి, కంపెనీ తిరిగి గాడిన పడింది. జీతాల పెంపుదల ఆలస్యం అయి నవంబర్ నుండి మాత్రమే అమలులోకి వచ్చినప్పటికీ, పూర్తి బోనస్‌లను అందించడం వల్ల ఉద్యోగుల స్ధైర్యాన్ని పెంచేందుకు కాగ్నిజెంట్ ప్రయత్నించింది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications