ఎయిర్‌పోర్ట్ పక్కనే దారుణం: కళాశాల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్!

తమిళనాడులోని కోయంబత్తూరు ఎయిర్పోర్టు సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ఒక కళాశాల విద్యార్థినిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. తీవ్ర గాయాలతో, నగ్న స్థితిలో ఉన్న బాధితురాలిని ఎయిర్పోర్టు వెనుక ఉన్న ఖాళీ స్థలంలో కనుగొన్నారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

స్నేహితుడిపై ఆయుధంతో దాడి
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని.. విమానాశ్రయం వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో తన కారులో తన స్నేహితుడితో మాట్లాడుతోంది. సరిగ్గా ఆ సమయంలో ముగ్గురు దుండగులు కారు వద్దకు చేరుకున్నారు. వారు వెంటనే విద్యార్థిని స్నేహితుడిపై పదునైన ఆయుధంతో దాడి చేసి అతడిని తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆ విద్యార్థినిని బలవంతంగా కారు నుంచి లాగి చీకట్లోకి తీసుకుపోయారు. ఆ దుండగులు ఆమెపై పదేపదే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను గాయాల పాలు చేసి అక్కడే వదిలి పారిపోయారు.

Coimbatore Airport Shock College Girl Kidnapped and Gang-Raped Near Runway

ఖాళీ స్థలంలో బాధితురాలు
దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి స్నేహితుడు ఎలాగోలా.. పీలామేడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన దారుణాన్ని పోలీసులకు వివరించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఓ బృందాన్ని ఏర్పాటు చేసి సంఘటనా స్థలానికి వెళ్లి గాలింపు చేపట్టారు. చాలా సేపు వెతికిన అనంతరం సమీపంలోని ఒక ఖాళీ స్థలంలో బాధితురాలిని అపస్మారక స్థితిలో, వస్త్రాలు లేకుండా కనుగొన్నారు. వెంటనే ఆమెను రక్షించి చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ.. తీవ్ర మానసిక షాక్‌లో ఉంది. గాయపడిన ఆమె స్నేహితుడిని కూడా కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం పంపారు.

ప్రత్యేక బృందాలతో గాలింపు
పీలామేడు పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్లు 363 (అపహరణ), 376 (అత్యాచారం), 376డి (సామూహిక అత్యాచారం), ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+