ఫోన్ వచ్చిందని ఇంట్లోకి.. ఒంటరి యువతిపై రేప్

Coimbatore: Neighbour sexually assaults minor while parents are at work
కోయంబత్తూరు: తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఒంటరిగా ఉన్న యువతిపై పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ఉప్పిలిపాళ్యంలో చోటు చేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు పి తంగరాజు(25) ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. కాగా, బాధితురాలు(17) 10వ తరగతి వరకు చదివి ఆ తర్వాత మానేసి ఇంట్లోనే ఉంటోంది. బాధితురాలి సోదరికి ముదురైకి చెందిన వ్యక్తి వివాహం కావడంతో ఆమె అక్కడే ఉంటోంది.

బాధిత యువతి ఇంట్లో లాండ్‌ఫోన్ గానీ, సెల్‌ఫోన్ గానీ లేదు. దీంతో బాధితురాలి సోదరి తంగరాజుకు ఫోన్ చేసి తమ తల్లిదండ్రులతో మాట్లాడేది. బాధితురాలి సోదరి ఎప్పుడు ఫోన్ చేసినా.. వారి ఇంటికి సమీపంలో ఉండే తంగరాజు ఆమె కుటుంబసభ్యులకు ఫోన్ తెచ్చి ఇచ్చేవాడు.

ఈ క్రమంలోనే శనివారం కూడా బాధితురాలి సోదరి ఫోన్ చేయడంతో ఆమె ఇంటికి వచ్చి ఫోన్ ఇచ్చాడు తంగరాజు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాధిత యువతి ఫోన్ మాట్లాడింది. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన తంగరాజు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పరారయ్యాడు.

కాగా, ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులతో బాధిత యువతి జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో బాధితురాలితోపాటు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి, నిందితుడు తంగరాజుపై ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, గాలింపు చేపట్టి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధిత యువతిని కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి ఆదివారం తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+