College girl: ఎంబీఏ అమ్మాయి గ్యాంగ్ రేప్, 7 నిందితుడు అరెస్టు, కేటుగాళ్ల రూటే సపరేట్, అందర్ !
బెంగళూరు: మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో 7 నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇంతకాలం తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో తలదాచుకుని తప్పించుకుని తిరుగుతున్న కామాంధుడిని మైసూరు పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడు నుంచి మైసూరు పిలుచుకుని వచ్చి అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీకి తీసుకుని విచారణ చెయ్యాలని మైసూరు పోలీసులు బావిస్తున్నారని తెలిసింది. మైసూరుకు చెందిన ఎంబీఏ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటికే ఆరు మందిని పోలీసులు అరెస్టు చేశారు. మైసూరు విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టు అయిన బాలనేరస్తుడు మైసూరులోని బాలనేరస్తుల కారాగారంలో ఉన్నాడు. మిగిలిన నిందితుల పోలీసు కస్టడీ గడువు మంగళవారంతో పూర్తి కావడంతో నిందితులు అందర్ని మైసూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

తమిళనాడులో కామాంధులు
మైసూరులోని ప్రముఖ కాలేజ్ లో ఎంబీఏ చదువుతున్న ముంబాయికి చెందిన కాలేజ్ అమ్మాయి మీద ఆగస్టు 24వ తేదీ రాత్రి చాముండి కొండ సమీపంలోని లలితాద్రిపురం సమీపంలో గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే. వీరప్పన్ అడ్డా అయిన సత్యమంగలం జిల్లాలోని తిరుప్పూర్ తో పాటు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న భూపతి (25), మురగేషన్ (22), ప్రకాష్ అలియాస్ అరవింద్ (21)తో పాటు 17 సంవత్సరాల మరో కామాంధుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

అరటి కాయల వ్యాపారం
తమిళనాడు నుంచి అరటికాయల లోడ్ తీసుకుని వచ్చిన కామాంధులు మందు పార్టీ చేసుకోవడానికి మైసూరు సమీపంలోని అటవి ప్రాంతంలోకి వెళ్లి అదే సమయంలో అటువైపు వచ్చిన ప్రేమికులను పట్టుకుని దారుణం చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గత రెండు సంవత్సరాల నుంచి మేము మైసూరు వచ్చిన ప్రతిసారి రేప్ లు, దారి దోపీడీలు చేశామని పోలీసు కస్టడీలో ఉన్న నిందితులు అంగీకరించారు.

బాధితులు చాలా మందే ఉన్నారు.... బయటకు రాలేదు అంతే
మాకు వయసుతో పని లేదు, ఆంటీనా అమ్మాయా అని మేము ఆలోచించము, ఆడది కనపడిందా మా పని మేము చేసుకోని పోతామని కామాంధులు ఇప్పటికే పోలీసులకు చెప్పారు. దారి దోపిడీలు చెయ్యడానికి మేము ప్రయత్నిస్తామని, ఆ సమయంలో ఆంటీలు కనపడినా, అమ్మాయిలు కనపడినా సరే వారిని నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశామని నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు.

పోలీసులకు ఫస్ట్ టైమ్ చిక్కారు
తమిళనాడు నుంచి అరటికాయల లోడ్ తీసుకుని వచ్చిన కామాంధులు మందు పార్టీ చేసుకోవడానికి మైసూరు సమీపంలోని అటవి ప్రాంతంలోకి వెళ్లి అదే సమయంలో అటువైపు వచ్చిన ప్రేమికులను పట్టుకుని దారుణం చేశారని పోలీసులు అంటున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి మేము చాలా మందిని అత్యాచారం చేశామని, అయితే ఎప్పుడు పోలీసులకు చిక్కలేదని, ఇప్పుడు టైమ్ బాగాలేక చిక్కిపోయామని నిందితులు నేరం అంగీకరించాడని ఓ సీనియర్ పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.

7 కామాంధుడు వీడే
మైసూరు కాలేజ్ అమ్మాయి మీద ఆరు మంది గ్యాంగ్ రేప్ చేశారని మొదట ప్రచారం జరిగింది. అయితే మేము ఆరు మంది కాదు ఏడు మంది కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేశామని, ఇక్కొక్కడు ఉన్నాడని నిందితులు అప్పుడే అంగీకరించారు. తమిళనాడులో తలదాచుకున్న సెల్వా (27) అనే కామాంధుడు బుధవారం తమిళనాడులో మైసూరు పోలీసులకు చిక్కిపోయాడు. తమిళనాడు నుంచి సెల్వాను మైసూరు పిలుచుకుని వచ్చి అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీకి తీసుకుని విచారణ చెయ్యాలని మైసూరు పోలీసులు బావిస్తున్నారని తెలిసింది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications