College Girl: కాలేజ్ అమ్మాయి మీద ?, ఫోక్సో చట్టం కేసులో డాక్టర్ రజనీకాంత్ అరెస్టు, మేనేజర్ !
చెన్నై/కరూర్: ప్రముఖ సిటీలో ప్రైవేటు ఆసుపత్రి ఏర్పాటు చేసిన డాక్టర్ రోగులకు చికిత్స చేస్తున్నాడు. ఆసుపత్రిలో చాలా మంది ఉద్యోగం చేస్తున్నారు. దసరా పండుగకు కాకుండా దీపావళి పండుగ సందర్బంగా ఆసుపత్రిలో పని చేస్తున్న ఉద్యోగులకు బోనస్ తో పాటు స్వీట్ బాక్స్ లు పంచిపెట్టారు. ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ మహిళ ఆ రోజు బోనస్ తీసుకోవడానికి వెళ్లేదు. ఆ రోజు మహిళ కూతురికి ఫోన్ చేసిన డాక్టర్ మీ మమ్మి ఎక్కడ అని అడిగారు. మా బంధువులకు ఆరోగ్యం బాగాలేకపోతే వారిని చూడటానికి ఊరికి వెళ్లిందని ఆ అమ్మాయి చెప్పింది. నువ్వు ఆసుపత్రికి వచ్చి బోనస్ డబ్బుతో పాటు స్వీట్ బాక్స్ తీసుకెళ్లాలని డాక్టర్ చెప్పాడు. బోనస్ తీసుకోవడానికి ఆసుపత్రికి వెళ్లిన 17 ఏళ్ల ఇంటర్ చదువుతున్న అమ్మాయి మీద కామాంధుడైన డాక్టర్ తో పాటు అదే ఆసుపత్రి మేనేజర్ లైంగిక దాడి చెయ్యడంతో ఆసుపత్రి సిబ్బంది హడలిపోయారు. తప్పించుకుని తిరుగుతున్న ప్రముఖ డాక్టర్ రజనీకాంత్, మేనేజర్ ఫోక్సో చట్టం కింద అరెస్టు కావడం కలకలం రేపింది.

ఫేమస్ ఆసుపత్రిలో డాక్టర్ రజనీకాంత్
తమిళనాడులోని కరూరులో ఎంతో పేరు ఉన్న డాక్టర్ జీ.సీ. ఆసుపత్రి ఉంది. కరూరులోని ప్రైవేటు ఆసుపత్రి ఏర్పాటు చేసిన డాక్టర్ రజనీకాంత్ కరూరుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు చికిత్స చేస్తున్నాడు. డాక్టర్ రజనీకాంత్ నిర్వహిస్గున్న డాక్టర్. జీ,సీ ఆసుపత్రిలో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు.

దసరాకు బోనస్ ఇచ్చిన డాక్టర్ రజనీకాంత్
దసరా పండుగకు కాకుండా దీపావళి పండుగ సందర్బంగా ఆసుపత్రిలో పని చేస్తున్న ఉద్యోగులకు డాక్టర్ రజనీకాంత్ బోనస్ తో పాటు స్వీట్ బాక్స్ లు పంచిపెట్టారు. ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ మహిళ ఆ రోజు బోనస్ తీసుకోవడానికి వెళ్లేదు. మహిళ బోనస్ తీసుకోవడానికి ఆసుపత్రికి రాలేదని అక్కడ పని చేస్తున్న సిబ్బంది డాక్టర్ రజనీకాంత్ కు చెప్పారు.

కూతురికి ఫోన్ చేసి పిలిపించిన డాక్టర్ రజనీకాంత్
ఆసుపత్రిలో పని చేస్తున్న మహిళ కూతురు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. మహిళ కూతురికి ఫోన్ చేసిన డాక్టర్ రజనీకాంత్ మీ మమ్మి ఎక్కడ అని అడిగారు. మదురైలో ఉన్న మా బంధువులకు ఆరోగ్యం బాగాలేకపోతే వారిని చూడటానికి ఊరికి వెళ్లిందని ఆ అమ్మాయి డాక్టర్ రజనీకాంత్ కు చెప్పింది. నువ్వు ఆసుపత్రికి వచ్చి బోనస్ డబ్బుతో పాటు స్వీట్ బాక్స్ తీసుకెళ్లాలని డాక్టర్ రజనీకాంత్ చెప్పాడు.

అమ్మాయి మీద లైంగిక దాడి చేసిన డాక్టర్ రజనీకాంత్
బోనస్ తీసుకోవడానికి ఆసుపత్రికి వెళ్లిన 17 ఏళ్ల ఇంటర్ చదువుతున్న అమ్మాయి మీద కామాంధుడైన డాక్టర్ రజనీకాంత్ కన్నుపడింది. డాక్టర్ రజనీకాంత్ ఆ అమ్మాయిని అతని క్యాబిన్ లోకి పిలుచుకుని వెళ్లి లైంగిక దాడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. తరువాత ఆసుపత్రిలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న శరవణన్ లైంగిక దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి.
Recommended Video

డాక్టర్ కామాంధుడు అరెస్టు
అమ్మాయి తల్లి ఫిర్యాదు చెయ్యడంతో కరూర్ మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు రంగంలోకి దిగారు. కేసు నమోదు అయ్యిందని తెలుసుకున్న డాక్టర్ రజనీకంత్, మేనేజర్ శరవణన్ పరారైనారు. చెన్నై, కరూరు, బెంగళూరులో డాక్టర్ రజనీకాంత్ కోసం పోలీసులు గాలించారు. చివరికి వేలాధుయంపాళ్యంలో తలదాచుకున్న డాక్టర్ రజనీకాంత్ తో పాటు శరవణన్ ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తి నసీమా బాను ముందు నిందితులను హాజరుపరచగా 14 రోజులు జ్యుడీషయల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చెయ్యడంతో నిందితులను కరూరు సెంట్రల్ జైలుకు తరలించామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications