Cognyte : పెగాసస్ స్ధానంలో కాగ్నైట్-విపక్షాలపై కేంద్రం మరో అస్త్రం ?
దేశంలో విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఇప్పటికే కేంద్రం పెగాసస్ స్పైవేర్ వాడుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ మరో సంచలన ఆరోపణ చేసింది. పెగాసస్ తరహాలోనే మరో స్పైవేర్ కాగ్నైట్ ను కొనుగోలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన బయటపెట్టారు.
కాగ్నైట్ వెబ్‌పేజీలో ఇజ్రాయెలీ సాఫ్ట్‌వేర్ సురక్షిత ప్రపంచం కోసం కార్యాచరణ మేధస్సుతో ప్రభుత్వాలు, సంస్థలకు అధికారం ఇచ్చే పరిశోధనాత్మక విశ్లేషణల సాఫ్ట్‌వేర్‌లో గ్లోబల్ లీడర్ అని పేర్కొందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఇవాళ ఆరోపించారు.

రూ. 986 కోట్ల వ్యయంతో 'కాగ్నైట్' అనే పెగాసస్ తరహా గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఖేరా ఆరోపించారు. రాజకీయ నాయకులు , మీడియా, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలపై నిఘా పెట్టేందుకు దీనిని ఉపయోగిస్తారని ఆయన తెలిపారు.
పెగాసస్ అపఖ్యాతి పాలైనందున కనీస పాలన-గరిష్ట నిఘా ఉన్న కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో కొత్త స్పైవేర్ కోసం చూస్తోందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. పాలక ప్రభుత్వం ప్రతిపక్షాలను ద్వేషిస్తుందనే విషయం అర్ధమైందని, అయితే వారు తమ మంత్రులపై గూఢచర్యం సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారని ఖేరా ఆరోపించారు.
ఈ దేశంలోని ఇద్దరు గూఢచారులు ఎవరినీ నమ్మరు, చట్టాన్ని, మీడియాను కూడా నమ్మరని ఖేరా మోడీ, అమిత్ షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకే వారు గూఢచారి సాఫ్ట్‌వేర్, ఇజ్రాయెల్ టెక్నాలజీని కొనుగోలు చేయడానికి పన్ను చెల్లింపుదారుల కోట్లాది డబ్బును ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
చక్రవర్తి తన అబద్ధాల రాజభవనం మన సత్యాలలో ఒకదాని నుండి కూలిపోతుందని భయపడుతున్నందున ఇలా చేస్తున్నారంటూ మోడీని ఉద్దేశించి ఖేరా సంచలన విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థ, పౌరులు , సొంత మంత్రులపై కూడా గూఢచర్యం చేయడానికి ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగిస్తుందని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications