వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధైర్యముంటే అమిత్ షా అక్కడ పర్యటించాలి: సోనియా గాంధీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్‌ కూడా పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తోంది. ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఇక చట్టంపై పలు యూనివర్శిటీ విద్యార్థులు నిరసనలు తెలిపారు. ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు. అమిత్‌షాకు ధైర్యం ఉంటే ఈశాన్య రాష్ట్రాల్లో అడుగుపెట్టాలని ఛాలెంజ్ చేశారు.

మోడీ ప్రభుత్వం అడుగులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించిన సోనియాగాంధీ.. దేశంలో హింసను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.దేశంలోని యువత స్వేచ్ఛను హరిస్తున్నారని సోనియా ధ్వజమెత్తారు.దేశంలో మతపరమైన విబేధాలు సృష్టించి తద్వారా రాజకీయంగా లబ్ది పొందాలని భావిస్తోందని సోనియాగాంధీ ఫైర్ అయ్యారు. ఇక వీటన్నిటినీ చేస్తున్నది మోడీ-షా ద్వయమే అని సోనియాగాంధీ విమర్శించారు.

Congress Chief Sonia dares Amitshah to tour in Northeastern states

అస్సాం, త్రిపురా, మేఘాలయా రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయని చెప్పిన సోనియా గాంధీ... చట్టంను చేసిన అమిత్‌షానే అక్కడ అడుగుపెట్టేందుకు సాహసించడం లేదని చెప్పారు. ఈశాన్యంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో బంగ్లాదేశ్ విదేశీవ్యవహారాల శాఖ మంత్రి, జపాన్ ప్రధాని షింజో అబేలు తమ పర్యటనలను వాయిదా వేసుకున్నారని సోనియాగాంధీ గుర్తుచేశారు.

ఇదిలా ఉంటే అస్సాం ఆర్థికశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్రంలో పరిస్థితులు మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను త్వరలోనే పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇక అస్సాంలో చాలా చోట్ల అమలులో ఉన్న కర్ఫ్యూను ఎత్తివేస్తామని చెప్పారు. ఇక ఆందోళన నేపథ్యంలో అస్సాం పోలీసులు 136 కేసులు నమోదు చేయగా 190 మందిని అరెస్టు చేశారు.

English summary
Congress leader Sonia Gandhi has dared Amit Shah to visit the Northeast as the region burns in violent protests over the amended citizenship law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X