గుజరాత్‌లో 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటు

Posted By:
Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అహ్మద్‌పటేల్‌కు వ్యతిరేకంగా ఓటు చేసిన రెబెల్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేసింది.

బిజెపికి షాక్: రాజ్యసభకు అహ్మద్ పటేల్, నెక్ట్స్ టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలే

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్‌పటేల్‌ను ఓడించేందుకు బిజెపి తీవ్రంగా ప్రయత్నించింది. అయితే చివరినిమిషం వరకు ఈ పోలింగ్‌లో ఉత్కంఠ నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహత్మకంగా వ్యవహరించడంతో అహ్మద్‌పటేల్ విజయం సాధించారు.

బిజెపికి షాక్: ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కావు: ఈసీ

శంకర్‌సింగ్ వాఘేలా గ్రూపుకు చెందిన రెబెల్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ వేటేసింది. మహేంద్ర వాఘేలా, రాఘవాజీ పటేల్, అమిత్ చౌదరి తదితరులతో పాటు 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది.

Congress expels 14 Gujarat MLAs who voted against Ahmed Patel in Rajya Sabha elections

వీరిని ఆరేళ్ళపాటు పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Gujarat Congress today expelled 14 Gujarat MLAs for cross-voting in favour of BJP in the Rajya Sabha elections on Tuesday.The MLAs - Mahendra Vaghela, Raghavji Patel, Amit Choudhary, Bholabhai Gohil, CK Raulji, Kamsi Makwana, Hakubha Jadeja - were supposed to be close to Shanhkersinh Vaghela, who revolted against the party recently.
Please Wait while comments are loading...