ప్రమాణస్వీకారంపై 'స్టే' కుదరదన్న సుప్రీం, యడ్యూరప్పకు లైన్ క్లియర్

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న తమను కాదని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వజుభాయ్ వాలా యడ్యూరప్పను ఆహ్వానినంచడంపై కాంగ్రెస్, జేడీఎస్ న్యాయపోరాటానికి సిద్దమయ్యాయి.ఈ మేరకు కాంగ్రెస్, జేడీఎస్ ల తరుపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కు పిటిషన్ అందజేసిన సింఘ్వీ.. దీనిపై సత్వర విచారణ జరిపించాలని కోరారు.

yeddi

యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే ఇవ్వడంతో పాటు, బలనిరూపణకు ఇచ్చిన 15రోజుల గడువుపై కూడా స్టే ఇవ్వాలంటూ పిటిషన్ లో కాంగ్రెస్, జేడీఎస్ లు పేర్కొన్నాయి.

విచారణకు స్వీకరించిన సుప్రీం:

అత్యవసర విచారణ జరపాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం అర్థరాత్రి తర్వాత 1.45గం.కి విచారణ చేపట్టాలని నిర్ణయించింది. జస్టిస్ ఏకె సిక్రీ, ఎస్ఏ బోబ్డే, అశోక్ భూషణ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది.

Read More

ఇదే అంశంపై కాంగ్రెస్, జేడీఎస్ ల తరుపు న్యాయవాది జావెద్ మాట్లాడుతూ.. 'బీజేపీ గెలిచింది 104స్థానాలు. అసెంబ్లీలో బలనిరూపణ ఎలా సాధ్యం?. స్వతంత్ర ఎమ్మెల్యేలను కలుపుకున్నా అది సాధ్యపడదు. కాబట్టి నయానో.. భయానో.. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.' అని పేర్కొన్నారు.

కాగా, కాంగ్రెస్, జేడీఎస్ లు అత్యవసర విచారణ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. సుప్రీం రిజిస్ట్రాటర్ సీజేఐ (ప్రధాన న్యాయమూర్తి) దీపక్ మిశ్రా ఇంటికి వెళ్లారు. ఈ విషయంపై ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది.

మరోవైపు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇదే అంశంపై మాట్లాడుతూ.. బలనిరూపణలో తాము కచ్చితంగా నెగ్గి తీరుతామన్నారు. బుధవారం రాత్రి బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప ఇంట్లో ఆయన మంతనాలు జరిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Abhishek Manu Singhvi who is the counsel for JD(S) & #Congress, seeks emergency hearing on the pleas submitted by the 2 parties.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X