వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేబినెట్ ఆమోదం లేకుండా వ్యవసాయ చట్టాలు రద్దా ? బీజేపీపై చిదంబరం విసుర్లు

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ప్రధాని మోడీ తాజాగా చేసిన ప్రకటనపై విపక్ష కాంగ్రెస్ విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే కోవలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సైతం మోడీ ప్రకటనను తప్పుబట్టారు. ముఖ్యంగా కేబినెట్ తో సంబంధం లేకుండా బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల్ని చిదంబరం ఖండించారు.

కేబినెట్ తో సంబంధం లేకుండా గతంలో వ్యవసాయ చట్టాల్ని అమల్లోకి తెచ్చిన బీజేపీ.. ఇప్పుడు కూడా కేబినెట్ తో చర్చించకుండానే చట్టాల్ని రద్దు చేసేందుకు ప్రయత్నించడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తెలిపారు. ముందస్తు కేబినెట్ ఆమోదం లేకుండానే కీలక నిర్ణయాలు తీసుకున్నారని అధికార బీజేపీపై చిదంబరం మండిపడ్డారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనను కాంగ్రెస్ నాయకుడు ప్రస్తావిస్తూ, పార్లమెంటులో సరైన విధానంతో మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేస్తుందని ప్రకటించారు.

congress leader chidambaram take dig at bjp, laws made and unmade without cabinet approval

ప్రధానమంత్రి మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించకుండా ప్రకటన చేశారని మీరు గమనించారా? ముందస్తు కేబినెట్ ఆమోదం లేకుండా చట్టాలు మరియు రూపొందించబడనివి బిజెపి హయాంలో మాత్రమే" అని పి చిదంబరం అన్నారు.శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత చేసిన ట్వీట్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై కూడా ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులు, కాంగ్రెస్‌కు గొప్ప విజయమని చిదంబరం తెలిపారు. ఇది కేంద్రం మనసు మారడం వల్ల కాదని, కేవలం భయంతో తీసుకున్నదేనని చిదంబరం అభివర్ణించారు.

English summary
congress leader chidambaram on today took dig at bjp and says fam laws made and unmade without cabinet approval.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X