ఇది..ఎవరో చెప్పండి - రాహుల్ నైట్ క్లబ్ వివాదం కొత్త మలుపు : కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్..!!

రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. బీజేపీ నేతలు ఈ వీడియో ద్వారా కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం కంటిన్యూ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేస్తున్న విమర్శలు ఖండిస్తోంది. రాహుల్ వ్యక్తిగత ట్రిప్ లో భాగంగా నేపాల్ వెళ్లారని చెప్పుకొచ్చారు. నేపాల్ భారత్ కు మిత్రదేశమని.. రాహుల్ గాంధీ వివాహ వేడుకకు వెళ్లారని రణ్‌దీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు. అంతేగానీ ప్రధాని మోదీలా మాజీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట వేడుకకు వెళ్లలేదు.. షరీఫ్‌తో కలిసి కేక్‌ కట్టింగ్‌ చేయలేదు. ఆయన పర్యటన తర్వాతే పఠాన్‌కోట్‌లో ఏం జరిగిందో మనందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

ఇక, బీజేపీ నేతలు రాహుల్ వీడియో వైరల్ చేస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్‌ ఒక ట్వీట్ చేసారు. అందులో బీజేపీ నేత ప్రకాశ్‌ జవదేకర్‌కు సంబంధించిన ఫొటోలను పోస్టు చేసారు. ఇది ఎవరో చెప్పాలంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో మతఘర్షణలు జరుగుతుంటే రాహుల్ గాంధీ ఎంచక్కా పార్టీ చేసుకుంటున్నారని విమర్శలు సంధించారు. కష్టాల్లో ఉన్న పార్టీని వదిలి విదేశాల్లో పార్టీ చేసుకుంటున్నారని అన్నారు. కాగా నేపాల్‌లోని చైనా అంబాసిడర్‌తో కలిసి పార్టీ చేసుకున్నట్లు ప్రచారం కొనసాగుతోంది.

Rahul night club video has attacked the new rift between the Congress and the BJP.

ఇక, ప్రకాశ్ జవదేకర్ ఫొటోతో చేసిన ట్వీట్ ను ఇప్పుడు కాంగ్రెస్ నేతలు వైరల్ చేస్తున్నారు. అయితే, బీజేపీ త్వరలో ఇలా బంధువులు, స్నేహితుల పెళ్లిళ్లకు వెళ్లడాన్ని ఒక నేరంగా ప్రకటిస్తుందేమో అంటూ కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. రాహుల్‌ నేపాల్‌లో ఉన్నట్టు ఖాట్మండు పోస్ట్‌ కథనం కూడా నిర్ధారించింది. రాహుల్ తో పాటుగా ఫొటోలో నేపాల్ లోని చైనా రాయబారి కూడా ఉండటం ఈ వివాదం మరింత తీవ్రం కావటానికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా... ట్వీట్లు, పోస్టులతో సెటైర్లు, విమర్శలు కొనసాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+