ఎంపీ కాన్వాయ్ బీభత్సం: ముగ్గురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
బీహార్‌లోని సపుల్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రంజీత్ రంజన్ కాన్వాయ్ సోమవారం బీభత్సం సృష్టించింది.
పాట్నా: బీహార్‌లోని సపుల్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రంజీత్ రంజన్ కాన్వాయ్ సోమవారం బీభత్సం సృష్టించింది. సపుల్‌లోని నిర్మాలి - సికార్హత ప్రధాన రహదారిలో ఆమె కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ముగ్గురు మృత్యువాత పడ్డారు.
ఈ ఘటన సమయంలో నిర్మలి బ్లాక్ కాంగ్రెస్ చీఫ్ రామ్‌ప్రసేష్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారు. అయితే, ఈ ఘటనలో గాయపడిన వారిని ఆయన తన వాహనంలో ఎక్కించుకొని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం వారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ ఘటనపై స్థానికులు సదరు ఎంపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications