సీఎం వర్గానికి వార్నింగ్, మీ పని మీరు చూసుకోండి, మీడియా ముందు మాట్లాడితే మొదటికే మోసం !

కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీలో డీసీఎం పదవులు కావాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వర్గం ఎమ్మెల్యేలు, ప్రస్తుత మంత్రులు అయిన డాక్టర్ జీ పరమేశ్వర్, కేఎన్ రాజన్నతోపాటు మరో ముగ్గురు సీనియర్ మంత్రులు ఉప ముఖ్యమంత్రి పదవులు కల్పించాలని హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు.

అయితే ఈ ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టింది. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ డీసీఎం పదవి విషయంలో ఢిల్లీలో చర్చలు జరగలేదని అన్నారు. డీసీఎం పదవుల విషయంలో చర్చ జరుగుతోందా అనే ప్రశ్నకు హోమ్ మంత్రి పరమేశ్వర్ ఇలా వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీసీఎం పదవులు ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు తేల్చి చెప్పిందని తెలిసింది.

Congress party high command warns Karnataka senior leaders not to talk openly about DCM posts

లోక్ సభ ఎన్నికల సమయంలో డీసీఎం అంశంపై ఎవరూ చర్చించవద్దని, మీడియా ముందు స్టేట్ మెంట్లు ఇవ్వకూడదని కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ కర్ణాటకలోని సిద్దరామయ్య వర్గంలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు చాలా సీరియస్ గా ఆదేశాలు జారీ చేసిందని కర్ణాటకకు చెందిన సీనియర్ మంత్రి చలువరాయస్వామి తెలిపారు. ఢిల్లీలో ముగ్గురు డీసీఎం పదవుల విషయంలో చర్చ జరిగిందనే విషయంలో కర్ణాటక హోమ్ మంత్రి జి. పరమేశ్వర్ స్పందించారు.

డీసీఎం పదవులు విషయంలో ఎలంటి చర్చ జరగలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేనే స్పష్టం చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ఆలోచన ఏదీ లేదని హైకమాండ్ చెప్పిందని పరమేశ్వర్ అన్నారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని మాకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే పిలుపునిచ్చారని పరమేశ్వర్ అన్నారు. ఒక్క కర్ణాటకనే కాకుండా అన్ని రాష్ట్రాలలోని పార్టీ నాయకులను ఢిల్లీకి ఆహ్వానించారని పరమేశ్వర్ వివరించారు.

Congress party high command warns Karnataka senior leaders not to talk openly about DCM posts

దేశంలో మొత్తం 5 క్లస్టర్లు ఉండగా, కర్ణాటక క్లస్టర్ 1లో ఉందని, కమిటీలు ఎలా వేయాలి, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఢిల్లీలో చర్చ జరిగిందని ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో మంత్రుల పోటీపై ఎలాంటి చర్చ జరగలేదని, అభ్యర్థుల గురించి మాత్రం మాట్లాడారని అన్నారు. లోక్ సభ ఎన్నికలను ఎలా నిర్వహించాలనే దానిపై చర్చ జరిగిందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో సరిగ్గా పని చేయని వారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. గెలిచే ప్రాంతాల్లో ఓడిపోతే అక్కడ సరిగ్గా పని చేయలేదని తెలుసుకోవాలని మంత్రి పరమేశ్వర్ అన్నారు.

కర్ణాటక ప్రభుత్వంలో ఐదు మంది డీసీఎంల చర్చపై మంత్రి చలువరాయస్వామి స్పందించారు. ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటకకు చెందిన కొందరు మంత్రులను వార్నింగ్ ఇచ్చిందని, లోక్ సభ ఎన్నికల సమయంలో డీసీఎం పదవుల అంశంపై ఎవరూ చర్చించవద్దని ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. మండ్యలోని చుంచనగిరిలో కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయస్వామి మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే డీసీఎం పదవుల అంశం అనవసరం అని చెప్పారని మంత్రి చెలువరాయస్వామి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+