బీజేపీకి చుక్కలు చూపించిన ప్రతిపక్షం, లింగాయత్, రెడ్డి వర్గానికి ఎన్ని సీట్లు అంటే ?
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రసవత్తరంగా మారింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కులాల రంగు పులుముకుంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీని దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ భలే స్కెచ్ లు వేస్తోంది. కర్ణాటక రాజకీయాలను శాసించే లింగాయత్ కులం ఓట్లు చీల్చి లాభం పొందడానికి కాంగ్రెస్ అనేక కసరత్తులు చేస్తోంది. లింగాయత్ ఓట్లు మనకు వస్తే కచ్చితంగా మనమే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.
కొన్ని వారాల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నిల పోరు మొదలుకానుంది. ఎవరికి అధికారం కట్టబెట్టాలి అని ఓటర్లు డిసైడ్ చేస్తారు. బీజేపీకి ఓటు బ్యాంక్ గా ఉన్న లింగాయత్ ఓట్లు చీల్చడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే 124 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పరోక్షంగా బీజేపీని ఇరకాటంలో పెట్టారు.

124 మంది పార్టీ అభ్యర్థుల జాబితాలో లింగాయత్ వర్గానికి పెద్ద పీట వేసిన కాంగ్రెస్ నాయకులు ఇంతకాలం ఆ కులం ఓట్లతో రాజకీయం చేస్తున్న బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చింది. 124 మంది అభ్యర్థుల్లో లింగాయత్ కులంలోని 28 మందికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడంతో బీజేపీ నాయకులు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు.
28 మంది లింగాయత్ కమ్యూనిటీలో ఐదు మంది రెడ్డి లింగాయత్ (రెడ్డి వర్గం) నాయకులు ఉన్నారు. ఏడు మంది పంచమశాలి లింగాయత్, ముగ్గురు బంజిగ లింగాయత్, ముగ్గురు విరశైవ లింగాయత్, ముగ్గురు సదర్ లింగాయత్, నలుగురు లింగాయత్ లకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయించింది. బెంగళూరులోని బీటీఎం లేఔట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రామలింగా రెడ్డి, ఆయన కుమార్తె, జయనగర సిట్టింగ్ ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయింది. లింగాయత్ తో పాటు ఒక్కలిగ కులానికి చెందిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయించి బీజేపీ నాయకులకు షాక్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications