వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ ప్రజలు, అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు, బీజేపీలా కాదు: ప్లీనరీలో రాహుల్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Congress Plenary Session : ఏపీకి స్పెషల్ స్టేటస్ పై కాంగ్రెస్ ప్లీనరీలో తీర్మానం

న్యూఢిల్లీ: దేశ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌తోనే దేశ ఐక్యత సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధినేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన నేతృత్వంలో శనివారం 84వ కాంగ్రెస్ ప్లీనరీ ఇందిరా గాంధీ మైదానంలో జరిగింది.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఈ ప్లీనరీ దేశానికి, కాంగ్రెస్ సభ్యులకు మార్గదర్శనం కావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ మొత్తాన్ని ఏకం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. పార్టీలోని అనుభవజ్ఞులు యువతకు మార్గనిర్దేశం చేయాలన్నారు.

దేశంలో యువతను నిరుద్యోగం వెంటాడుతోందని అన్నారు. 'ఈ దేశం ప్రజలందరిది. అన్ని మతాలు, వర్గాల వారిది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ పనిచేస్తోంది. వారు(బీజేపీ) విద్వేషంతో దేశాన్ని చీలుస్తున్నారు. మేం ప్రేమతో పనిచేస్తున్నాం. దేశాన్ని ఐక్యంగా ఉంచి ముందుకు నడిపించేది చేతిగుర్తే’ అని రాహుల్‌ అన్నారు.

 Congress plenary session: Rahul Gandhi to address meet today

కాగా, ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తోపాటు భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్లీనరీ సమావేశాల నిర్వహణను ప్రియాంక గాంధీ చూసుకుంటున్నారు.

అంతకుముందు జరిగిన అంతర్గత సమావేశంలో 2019 లోకసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాహుల్ పార్టీ నేతలకు రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో బీజేపీ వరుస ఓటములతో ప్రజలు ఆ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారనే విషయం తెలిసిపోయిందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చినట్లు సమాచారం.

English summary
The Congress’ three-day plenary session commenced at the Constitution Club in New Delhi on Friday. The focus of the conclave is primarily to prepare for the 2019 Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X