అయోధ్య ప్రాణప్రతిష్ట ఆహ్వానం తిరస్కరించిన కాంగ్రెస్-ఆరెస్సెస్, బీజేపీ ఈవెంట్ గా అభివర్ణన..

అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామమందిర ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దేశవ్యాప్తంగా దాదాపు 7 వేల మంది వరకూ ఆహ్వానాలు వెళ్లాయి. వీరిలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులతో పాటు పలువురు సెలబ్రిటీలు, ఇతరులు ఉన్నారు. ఇదే క్రమంలో ఆలయ ట్రస్టు నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరికి కూడా ఆహ్వానాలు వెళ్లాయి. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీటిపై కీలక నిర్ణయం తీసుకుంది.

అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకూడదని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆలయ ట్రస్టు పంపిన ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ నెల 22న జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలెవరూ హాజరుకావడం లేదని తేలిపోయింది. అయోధ్యలో జరిగే కార్యక్రమాన్ని ఆరెస్సెస్, బీజేపీ ఈవెంట్ గా అభివర్ణిస్తూ ఈ ఆహ్వానాన్ని గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.

Congress refused invitation to Ayodhya Ram Mandirs Inauguration, termed it an RSS, BJP Event

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఇవాళ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ హాజరుపై ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో రాముడిని దేశంలో లక్షలాది మంది పూజిస్తారని, మతం వ్యక్తిగత విషయమని తెలిపారు.అయితే ఆర్‌ఎస్‌ఎస్/బిజెపి చాలా కాలంగా అయోధ్యలో ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా తయారుచేశాయన్నారు. అసంపూర్తిగా ఉన్న ఈ ఆలయాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ప్రారంభించడం ఎన్నికల లబ్ధి కోసం ముందుకు తెచ్చినట్లు స్పష్టమవుతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+