Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ ఛాంపియన్‌ అని చెప్పుకొంటోంది గానీ..

Caste Census: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రకటించిన కుల గణన తరువాత పరిణామాలు మారుతున్నాయి. ఇది తమ ఘనతగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొంటోంది గానీ- అసలు లెక్కలు మాత్రం వేరేగా ఉంటోన్నాయి. వాటన్నింటినీబ బీజేపీ ఒక్కటొక్కటిగా బహిర్గతం చేస్తోంది.

కుల గణనలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తోన్న ప్రకటనలు, గతానుభవాలకు ఏ మాత్రం పొంతన ఉండట్లేదు. దాని ట్రాక్ రికార్డ్ పూర్తిగా భిన్నం. సంస్థాగత నిర్లక్ష్యం, విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో తీవ్ర జాప్యం, నెరవేరని హామీలు.. కాంగ్రెస్ ఖాతాలో ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తాయి.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుండి కాంగ్రెస్ సమగ్ర కుల గణనను నిర్వహించకుండా తప్పించుకుంటూ వచ్చిందనేది బహిరంగ రహస్యం. దీనివల్ల దేశానికి కీలకమైన డేటా అందుబాటులో లేకుండా పోయింది. ఓబీసీలు, సాధారణ సామాజిక వర్గాలతో సహా అన్ని కులాల జనాభా, ఆర్థిక స్థితిగతులపై కాంగ్రెస్‌కు ఎలాంటి పట్టింపు లేదనేది తేలిపోయింది.

Congress systemic neglect on the Caste Census since India s independence

కులాల ఆధారంగా జనాభా లెక్కలు తీయకపోవడం, డేటా సేకరణను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చింది కాంగ్రెస్. సమగ్ర కుల గణన 1931లో బ్రిటిష్ పాలనలో నమోదైంది. 1941 జనాభా లెక్కల్లో కులాల సమాచారం చేర్చినప్పటికీ, రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా అది విడుదల కాలేదు.

1951లో దేశం తన మొదటి జనాభా గణనను నిర్వహించినప్పుడు, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కుల గణనను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం- దశాబ్దాలుగా నిష్క్రియాత్మకంగా ఉండటానికి పునాదివేసింది. రాజకీయ కారణాలతో ఉద్దేశపూరకంగా దీన్ని పక్కనపెట్టింది.

ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రాతినిథ్యం, తమ హక్కుల కోసం కులం ఆధారంగా జనాభా లెక్కలను సేకరించాలంటూ చాలా ఓబీసీలు గానీ, ఇతర ప్రాంతీయ పార్టీలు గానీ డిమాండ్ చేసినప్పటికీ- కాంగ్రెస్ దాన్ని ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ క్రియాశీలకంగా వ్యవహరించడంలో విఫలమైంది.

2011 నాటవి జనాభా లెక్కల్లో కుల డేటాను చేర్చాలంటూ 2010లోనే అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తోసిపుచ్చింది. లాజిస్టికల్ సవాళ్లను కారణంగా చూపించింది. కొన్నిసార్లు కుల గణన ప్రాముఖ్యతను తక్కువ చేసి చూపించింది.

అన్ని రకాలుగా ఒత్తిడి ఉన్నప్పటికీ కాంగ్రెస్ కుల గణనకు అంగీకరించలేదు. 2011లో సామాజిక-ఆర్థిక కుల గణన (SECC) నిర్వహించడానికి మాత్రమే అంగీకరించింది. ఈ సర్వే- ప్రధాన జనాభా లెక్కల నుండి విడిగా నిర్వహించింది. ఫలితంగా కుల గణన అనేది మరుగున పడింది.

కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా నాటి నివేదికల విడుదలను వ్యతిరేకించారు. వక్కలిగ, లింగాయత్‌ల వంటి బలమైన సామాజిక వర్గాల నుండి వ్యతిరేకత వస్తుందనే భయాలను వ్యక్తం చేశారు. ఇది- సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ నిబద్ధతపై తీవ్ర సందేహాలను లేవనెత్తించినట్టయింది.

సమగ్ర, పారదర్శకమైన కుల గణనను నిర్వహించడానికి బదులుగా ఎన్నికల లాభం కోసం కుల ఆధారిత విభజనలను మరింత తీవ్రతరం చేయడానికి మాత్రమే ఉపయోగపడే రాజకీయ ప్రేరేపిత సర్వేలను కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చింది.

ప్రధాని మోదీ ప్రభుత్వంలో- బీజేపీ దేశవ్యాప్త కుల గణనను పారదర్శకంగా, అందరినీ కలుపుకొని, శాస్త్రీయబద్ధంగా నిర్వహించాలని ఒత్తిడి చేస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ వంటి పార్టీలు రాష్ట్ర స్థాయిలో అసంబద్ధంగా చేపట్టిన కుల గణనకు చెక్ పెట్టినట్టయింది. దీనివల్ల కోట్లాది రూపాయలు వృధా కాకుండా అడ్డుకోగలిగింది.

2015లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషియో- ఎకనమిక్ సర్వే నిర్వహించినప్పటికీ- ఆ నివేదికను తొమ్మిది సంవత్సరాలుగా విడుదల చేయలేదు. కొన్ని సామాజిక వర్గాల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తమౌంతుందని భావించడమే దీనికి ప్రధాన కారణం. కాంగ్రెస్‌కు వాస్తవ పరిస్థితులు అక్కర్లేదని, ఆయా కులాలపై నియంత్రణ మాత్రమే కావాలనే ధోరణికి ఇది అద్దం పట్టింది.

ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులను ఎలా అగౌరవపరిచిందో జగద్విదితం. వెనుకబడిన వర్గాల పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరు సిగ్గుచేటు అనే అభిప్రాయాలు సైతం లేకపోలేదు. సోనియా గాంధీ కోసం సీనియర్ ఓబీసీ నాయకుడు సీతారాం కేసరిని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుండి బయటకు పంపించారు. ఓబీసీ ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్‌ను అవమానించి, గౌరవం లేకుండా పదవి నుండి తొలగించారు.

దేశంలోని అత్యున్నత దళిత నాయకులలో ఒకరైన జగ్జీవన్ రామ్‌ను కాంగ్రెస్ వ్యవస్థలో ఎప్పుడూ కూడా ఎదగనివ్వలేదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ పక్కన పెట్టింది. హిందూ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేసిన సమయంలో కనీసం సంఘీభావం తెలుపలేదు.

రెండో దళిత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోనియా గాంధీ నుండి ఒక్క పర్యటన కూడా విడుదల కాలేదంటే ఆశ్చర్యమేస్తుంది. రాష్ట్రపతి పదవిని అధిష్ఠించిన తొలి గిరిజన మహిళ ద్రౌపది ముర్మును బీజేపీ నామినేట్ చేసినప్పుడు.. కాంగ్రెస్ ఆమెకు మద్దతు ఇవ్వలేదు.

బీసీ నాయకుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పార్టీ హైకమాండ్ ఏకవచనంతో పిలవడం, పార్టీలో ఉన్న ఎస్టీ నేతల పట్ల కాంగ్రెస్ చులకన భావాన్ని ప్రదర్శిస్తూ వచ్చిందని బీజేపీ ఆరోపిస్తోంది. కులగణన విషయంలో కాంగ్రెస్ మాటలకు మాత్రమే పరిమతం కాగా.. బీజేపీ చేతల్లో చూపిస్తోంది.

ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు అంతర్గత రిజర్వేషన్ల కోసం ఒక జాతీయ కమిటీని నియమించి తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఇది చారిత్రక అసమతుల్యతను పరిష్కరించడానికి ఓ స్పష్టమైన, నిర్ణయాత్మక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఈ విధానం ఇతర రాష్ట్రాలను సైతం దిశానిర్దేశం చేసింది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దీన్ని అనుసరించడం నిదర్శనం.

రాష్ట్ర జనాభాలో 98 శాతం మందిని కవర్ చేసే తెలంగాణ 2024 సామాజిక, విద్యా, ఉపాధి, ఆర్థిక కుల సర్వే ఫిబ్రవరి 2025లో పూర్తయింది. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం నవంబర్ 2024లో అంతర్గత రిజర్వేషన్లపై కమిషన్‌కు నాయకత్వం వహించడానికి జస్టిస్ నాగమోహన్ దాస్‌ను నియమించింది. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాత అది సాధ్యపడింది.

సమగ్రమైన, శాస్త్రీయ విధానం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు వాగ్దానాలు ఇచ్చినప్పటికీ, కమిషన్ నివేదిక అందిన తరువాత వాటిని అమలు చేయట్లేదు. సిద్ధరామయ్య తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ- 101 ఎస్సీ ఉప సంఘాలపై ఏర్పాటైన కమిషన్ సిఫార్సులు ఇప్పటికీ అమలు కాలేదు.

చారిత్రాత్మకంగా కుల గణనకు సంబంధించిన అనేక వివాదాలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకించి- 2011 సామాజిక-ఆర్థిక- కుల గణనలో కుల డేటాను ఎలా నిర్వహించిందనే దానిపై వివాదాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని UPA ప్రభుత్వంలో, కుల డేటాను సేకరించే ఉద్దేశ్యంతో సోషియో ఎకనమిక్ సర్వే 2011లో ప్రారంభించింది.

కుల-నిర్దిష్ట డేటాను ఎప్పుడూ బహిరంగపరచలేదు. దాన్ని రహస్యంగానే ఉంచింది. 1980 దశకంలో మండల్ కమిషన్ కుల జనాభా లెక్కల డేటా ఆధారంగా ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను సిఫార్సు చేసింది. చివరికి ఇది 1990లో అమలులోకి వచ్చింది. కాంగ్రెస్ రిజర్వేషన్ విధానాన్ని సమర్థించినప్పటికీ- సామాజిక-ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సరైన గుర్తింపును నిర్ధారించడంలో విఫలమైంది. వివరణాత్మక, నిర్మాణాత్మక కుల జనాభా గణను ఎప్పుడూ చేపట్టలేదు. సాగకపోవడం విమర్శించబడింది.

దీన్ని బట్టి చూస్తే- కుల గణనను కాంగ్రెస్ అసంబద్ధంగా సమర్థిస్తుందనేది తేటతెల్లమౌతోంది. సోషియో ఎకనమిక్ సర్వే ప్రారంభించినప్పటికీ- సమగ్ర కుల గణనకు అనుకూలంగా నిర్దుష్ట చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఇది- కుల ఆధారిత సంక్షేమం పట్ల వారి కాంగ్రెస్‌కు ఎలాంటి నిబద్ధత లేదనే విషయాన్ని స్పష్టం చేసినట్టయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+