MH Polls: శివాజీ ప్రతిష్టనే తగ్గిస్తారా ? మహాయుతిపై కాంగ్రెస్ విమర్శలు..!
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. ఇదే క్రమంలో ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్దిని టార్గెట్ చేసేందుకు అధికార మహాయుతితో పాటు విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రీయులకు ఆరాధ్యుడైన ఛత్రపతి శివాజీ ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారంటూ అధికార మహాయుతి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేసింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ల ఇన్ ఛార్జ్ కూడా అయిన జైరాం రమేశ్.. అధికార మహాయుతి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తాజాగా విమర్శలు చేశారు. సింధు దుర్గ్ లోని రాజ్ కోట్ కోటలో నిర్మిస్తున్న 35 అడుగుల శివాజీ విగ్రహం నిర్మాణంలో అక్రమాలకు పాల్పడటం ద్వారా మహాయుతి సర్కార్ ఆయన ప్రతిష్టను దిగజారుస్తోందని జైరాం రమేశ్ విమర్శించారు. ప్రధాని మోడీ ప్రారంభించిన ఏడాది లోపే ఈ విగ్రహం కూలిపోయింది. ఈ విషయాన్ని జైరాం రమేశ్ గుర్తుచేశారు.

మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వంతో పాటు ఢిల్లీలో ఉన్న దాన్ని నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం కూడా శివాజీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని జైరాం రమేశ్ తాజాగా ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం సాధారణంగా జన్మించని ప్రధాని ఈ విగ్రహానికి శంఖుస్థాపన చేశారని, చివరికి దాని విషయంలోనూ కల్లబొల్లి కబుర్లే చెప్పారని ఆయన విమర్శలు గుప్పించారు. శివాజీతో ప్రధానిని పోల్చడం ద్వారా బీజేపీ నేతలు ఆయన ప్రతిష్టను తగ్గిస్తున్నారని జైరాం మండిపడ్డారు.












Click it and Unblock the Notifications