గుజరాత్ పోరు: రాహుల్ గాంధీ ప్రశాంత్ కిశోర్ ఇతనే..

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్ శానససభ ఎన్నికల్లో కాంగ్రెసు నేత రాహుల్ గాంధీకి ఓ ప్రశాంత్ కిశోర్ దొరికాడు. ఎన్నికల వ్యూహం రూపొందించి విజయాన్ని అందించే వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌కు పేరు పొందారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు.

ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యూహకర్తనే గుజరాత్‌లో కాంగ్రెసు కోసం పనిచేస్తున్నాడు.ఆయన కాంగ్రెసు నేత కుల్దీప్ శర్మ. పెద్దగా ఆర్భాటం చేయకుండా చిన్న జట్టుతో గుట్టుగా ఆయన పనిచేసుకుంటూ పోతున్నారు. అహ్మదాబాద్‌లని పల్దీ రోడ్డులో గల రాజీవ్ గాంధీ భవన్ నుంచి ాన జట్ు పనిచేస్తోంది.

ఆ జట్టు ఏం చేస్తుంది...

ఆ జట్టు ఏం చేస్తుంది...

కుల్దీప్ శర్మ నేతృత్వంలోని చీఫ్ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ ఇంటిలెజన్స్, క్షేత్ర స్థాయిని సమాచారాన్ని సేకరిస్తుంది. దాన్ని విశ్లేషించి శానససభ ఎన్నికల్లో పనిచేస్తున్న నాయకులకు వ్యూహాత్మక విశ్లేషణను అందిస్తుంది.

రాహుల్ గాంధీ వాడుకుంటారు...

రాహుల్ గాంధీ వాడుకుంటారు...

కుల్దీప్ శర్మ ఇచ్చే సమాచారాన్ని రాహుల్ గాంధీ తన ప్రసంగాలు ఘాటుగా ఉండడానికి వాడుకుంారు. ప్రతి రోజూ రాష్ట్రంలోని బిజెపిపై ఘాటు వ్యాఖ్యలతో దాడి చేస్తారు. బూత్ స్థాయి కార్యకర్తల నుంచి, కొన్ని ప్రత్యేకమైన అంశాలపై వారి నుంచి సమాచారం తీసుకుని కల్దీప్ శర్మ జట్టు విశ్లేషించి క్రోడీకరిస్తుంది.

రెండేళ్ల క్రితం కాంగ్రెసులోకి....

రెండేళ్ల క్రితం కాంగ్రెసులోకి....

మాజీ ఐపిఎస్ అధికారి అయిన కుల్దీప్ శర్మ రెండేళ్ల క్రితం కాంగ్రెసులో చేరారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మోడీపై ఆయన విమర్శానాత్మక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తన జట్టులోకి గుర్గావ్‌కు శామ్ అనలిటిక్స్కు చందిన వెంకట రమణిని తీసుకున్నారు. వెంకటరమణి తమిళనాడులోని వివిధ రాజకీయ పార్టీల కోసం పనిచేశారు. బీహర్‌లో కాంగ్రెసు కోసం, ఉత్తరప్రదేశ్‌లో బిజెపి కోసం పనిచేశారు.

శర్మ ప్రకారం ఇలా...

శర్మ ప్రకారం ఇలా...

గుజరాత్ శాసనసభలోని 182 సీట్లలో బిజెపి 22 స్థానాల్లో, కాంగ్రెసు 22 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తాయనేది కుల్దీప్ శర్మ అంచనా. శర్మ జట్టు ఆ 44 సీట్లను వదిలేసి మిగతా 132 స్థానాలపై శర్మ జట్టు దృష్టి పెట్టింది. ఆ 132 సీట్లను ఆరు ప్రాంతాలుగా విభజించింది. అవి అహ్మదాబాద్ (11) వడొదర (27), రాజ్‌కోట్ (24), సూరత్ (20), మెహ్సానా (26), జునగఢ్ (3). గత 24 ఏళ్లుగా గుజరాత్‌లో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెసు తొలిసారి క్షేత్రస్థాయికి వెళ్తోందని అంటున్నారు.

ఇలాంటి బూత్‌లను గుర్తించారు

ఇలాంటి బూత్‌లను గుర్తించారు

కుల్దీప్ శర్మ జట్టు కాంగ్రెసు 20 శాతం కన్నా తక్కువ ఓట్లు పొందిన బూత్‌లను గుర్తించింది. అదే సమయంలో బిజెపి బలహీనతలను కూడా గుర్తించింది. బిజెపిలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని అభిప్రాయపడుతోంది. కుల్దీప్ శర్మకు, వెంకటరమణిలకు సృష్టి చౌదరి సహాయపడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kuldip Sharma heads a small team that works out of the third floor of the Rajiv Gandhi Bhavan on Ahmedabad's Paldi Road for Congress in Gujarat elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి