ఆ పార్టీ పనికిరాని ఇంజన్ తో సమానం, ఎంతలాగినా బండికదలదు, మోదీ రూటే సపరేటు !
బెంగళూరు/కోలారు/చెన్నపట్టణ: కర్ణాటక అభివృద్ది కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జేడీఎస్ తో జతకట్టి 85 శాతం కమీషన్ పాలన అందిస్తుందని. కేంద్రం ఇచ్చే నిధుల్లో ప్రజలకు 15 శాతమే అందుతుందని ప్రధాని నరంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం కర్ణాటకలోని కోలారు. చెన్నపట్టణ, హాసన్ జిల్లాలోని బేలూరులో, మైసూరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కన్నడిగులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతిచోట ప్రసంగం మొదలుపెట్టే ముందు కన్నడలోనే మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ స్థానిక ప్రజలను ఆకట్టుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం గతంలో కర్ణాటకకు ఒక్క రూపాయి నిధులు మంజూరు చేస్తే అందులో కాంగ్రెస్ ప్రభుత్వం 85 పైసలు మింగేసి మిగిలిన 15 పైసలు మాత్రమే ప్రజల చేతిలో పెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటకలో మళ్లీ ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కోరుకుంటున్నారా ? అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ప్రశ్నించారు.
మాది డబుల్ ఇంజన్ ప్రభుత్వం, కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ ది ఔట్ డేటెడ్ అయిన ఇంజన్, అలాంటి డొకోటా ఇంజన్ తో లక్షం చేరుకోవాలని మనం అనుకోవడం పొరపాటు అవుతుందని, అలాంటి పనికి రాని ఇంజన్ ను షెడ్ కే పరిమితం చెయ్యాలని ప్రధాని మోదీ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యకూడదని, బీజేపీకి ఓటు వేసి ఆదరించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి బహిరంగ సభలో ప్రజలకు మనవి చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలది విచిత్రమైన అనుభందం అని, ఆరెండు పార్టీలు కలిసి ప్రజలు నిలువుదోపిడీ చెయ్యడానికి ఎప్పటికప్పుడు ప్లాన్ వేస్తుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
హాసన్ జిల్లా జేడీఎస్ కు కంచుకోట అని దళపతులు భ్రమపడుతున్నారని, కాని మేము (బీజేపీ) ఇదే చోట పాగా వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో, కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంటే భారీ మొత్తంలో పెట్డుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు వస్తారని, బీజేపీకి మీరు ఓటు వేసి గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ కన్నడిగులకు మనవి చేశారు.












Click it and Unblock the Notifications