దొంగగా మారిన పోలీసు భార్య: అరెస్టు
ముంబై: ఓ పోలీస్ కానిస్టేబుల్ భార్య దొంగతనం కేసులో పట్టుబడిన సంఘటన ముంబై నగరంలో జరిగింది. ఆమె నుంచి రూ. 16 వేలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని బుధవారం ముంబై పోలీసు అధికారులు చెప్పారు.
విచారణలో ఆమె చెప్పిన మాటలు విన్న పోలీసులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. జీఆర్పీ కానిస్టేబుల్ కిసాన్ కట్కర్ భార్య ఉషా కట్కర్ (40) అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ రావ్ రాజీవ్ అనే వ్యక్తి నుంచి ఉషా కట్కర్ బ్యాగ్ కాజేసింది.
తన దగ్గర కాజేసిన బ్యాగ్ లో రూ. 16 వేలు, సెల్ ఫోన్ ఉందని, తన కుమారుడి పెళ్లి ఖర్చుల కోసం బ్యాంకులో నగదు డ్రా చేసుకుని తిలక్ నగరలోని తన ఇంటికి వెలుతున్న సమయంలో ఓ మహిళ బ్యాగ్ లాక్కొని వెళ్లిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి బ్యాగ్ కాజేసిన ఉషా కట్కర్ ను గుర్తించారు. వాదాల ప్రాంతంలోని ఇంటిలో ఉన్న ఉషాను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు. అయితే విచారణలో తాను ఎందుకు దొంగగా మారాల్సి వచ్చింది అంటూ ఆమె వివరణ ఇవ్వడంతో ఖాకీలు సైతం కదిలిపోయారు.
మిస్ ఫైర్ కేసులో తన భర్త అరెస్టు అయినప్పటి నుంచి గడ్డు పరిస్థితులు ఎదుర్కోంటున్నామని, కుటుంబం గడవడం కష్టంగా ఉందని, కుటుంబ పోషణ కోసం తాను దొంగను అయ్యానని ఉషా బోరున విలపించింది.
జీఆర్పీ కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఉషా భర్త కిసాన్ కట్కర్ 2011లో ముంబైలో ఓ లోకల్ ట్రైన్ లో డ్యూటిలో ఉన్నాడు. ఆ సందర్బంలో అతని చేతిలో ఉన్న తుపాకి ప్రమాదవశాత్తు పేలిపోయింది. మిస్ ఫైర్ అయిన సమయంలో కిసాన్ కట్కర్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు అతనిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications