సెక్స్ రాకెట్ రగడ: రాళ్లు రువ్విన స్థానికులు, పోలీసులకు గాయాలు

ఢిల్లీ: వ్యభిచార ముఠాను రట్టు చేసేందుకు వెళ్లిన పోలీసులు గాయపడ్డ సంఘటన ఢిల్లీలో జరిగింది! ఢిల్లీలోని నారెల ప్రాంతానికి వెళ్లిన పలువురు పోలీసుల పైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పదిమంది పోలీసులు గాయపడగా, ఐదు పోలీస్ కంట్రోల్ రూం వ్యాన్లు దెబ్బతిన్నాయి.

పోలీసులు ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో రైడ్ చేశారు. అప్పుడు ఈ సంఘటన జరిగింది. పోలీసులు స్పాట్‌కు వెళ్లారు. వారు అక్కడకు వెళ్లిన సమయంలో కొందరు మహిళలు ఓ మహిళ పైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆమె సెక్స్ రాకెట్ నిర్వహిస్తోందని ఆరోపించారు.

ఆ సమయంలో పోలీసులు ఆమెకు చెందిన ఇంట్లో ఐదుగురిని గుర్తించారు. అందులో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఆ ఇద్దరు మహిళలు ఆమె బంధువులు అని, పురుషులు వారి స్నేహితులు అని.. వారు చూసేందుకు వచ్చారని చెప్పినట్లు అధికారులు తెలిపారు.

Cops attacked in Narela over sex racket; 10 hurt

అనుమానితులను పోలీసులు తదుపరి విచారణ కోసం అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న గుంపులోని కొందరు వారు సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ, వారి పైన రాళ్లు వేశారు. వారు పోలీసుల ప్రోత్సాహంతోనే సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

ఆ యువకులు తమ స్నేహితులు అని, తమను కలిసేందుకు వచ్చారని, ఇద్దరు యువతులు, ఆ ఇంటికి చెందిన మహిళ చెప్పారని, అయితే, అక్కడే ఆగ్రహంతో ఉన్న గుంపుకు నచ్చ చెప్పేందుకు తాము ప్రయత్నించామని, అంతలోనే కొందరు ఇంటిలోకి చొచ్చుకెళ్లడంతో హింసాత్మకంగా మారిందని పోలీసులు చెప్పారు.

రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఓ పోలీసుకు చెయి ఫ్యాక్చర్ కూడా అయింది. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరికొంతమంది పోలీసు బలగాలని దించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సహకారంతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న స్థానికుల ఆరోపణల పైన పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+