వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా హెచ్చరిక.. 3,157 కొత్తకేసులు, 19,500కు పెరిగిన క్రియాశీల కేసులు, యూపీలో 144 సెక్షన్

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో భారతదేశంలో 3,157 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే 5% తక్కువ. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,82,345కి చేరింది. భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. కరోనా ఫోర్త్ వేవ్ ఆందోళన వ్యక్తం అవుతుంది.

భారతదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 19,500 వద్ద ఉంది. గత 24 గంటల్లో యాక్టివ్ కేసులు 408 పెరిగాయి. కరోనా యాక్టివ్ కేసుల శాతం 0.05కు పెరిగింది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినుండి కోరుకున్న వారి శాతం 98.74కు చేరింది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి తో 26 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో నిర్వహించబడిన సంచిత మోతాదులు 189.17 కోట్లకు మించి ఉన్నాయి.

Corona alert .. Concerned with 3,157 new cases, increased to 19,500 active cases

కోవిడ్ కేసుల పెరుగుదల ధోరణిని దేశం చూస్తుండగా, ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ద్ నగర్‌లో మే 1 నుండి 31 వరకు సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించబడినట్లు సమాచారం. కొత్త ఆర్డర్ ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌లు ధరించడం కూడా తప్పనిసరి చేయబడింది. ఇదే సమయంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎవరూ ఎటువంటి నిరసనలు లేదా నిరాహార దీక్షలు చేయడానికి అనుమతించకూడదు. బహిరంగ ప్రదేశాల్లో పూజలు నిర్వహించడం మరియు నమాజ్ చేయడం అనుమతించబడదు అని గౌతమ్ బుద్ నగర్ పోలీస్ కమిషనరేట్ తెలిపింది. పరీక్షల సమయంలో పాఠశాలల్లో సామాజిక దూరాన్ని సరైన కోవిడ్ -19 మార్గదర్శకాలతో నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే అనేక రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను మళ్ళీ అమల్లోకి తెస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అలెర్ట్ చేస్తుంది. ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రాలలో కరోనా పరిస్థితులను తెలుసుకున్నారు, పెరుగుతున్న కేసులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బహిరంగ ప్రదేశాలలో మాస్కులు తప్పనిసరి చేసిన రాష్ట్రాలు నిబంధనలను పాటించకుంటే ఫైన్లు విధిస్తామని తేల్చి చెప్పారు.

English summary
There were 3,157 new corona cases registered in India recently, 26 people died. Concerns have been raised with an increase in the number of active cases to 19,500. Section 144 has been imposed in several areas with increased cases in UP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X