భారత్ లో కరోనా కేసుల ఊగిసలాట : తాజాగా 38,949 కొత్త కేసులు, 100 రోజుల కనిష్టానికి మరణాలు
భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఒకపక్క కరోనా థర్డ్ వేవ్ మొదటి దశలో ఉన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తూ, ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇక ఇదే సమయంలో భారతదేశంలో కరోనా మహమ్మారి కేసుల ఊగిసలాట కొనసాగుతోంది. గత 24 గంటల్లో 38,949 కొత్త కేసులు నమోదు కాగా భారతదేశం యొక్క మొత్తం కేసుల సంఖ్య శుక్రవారం 3,10,26,829 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
గత 24 గంటల్లో 542 మంది మృతి
గత 24 గంటల్లో 542 మంది మరణించారు . దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,12,531 కు చేరుకుంది. గత 24 గంటల్లో 40,026 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. మరణాలు 100 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,0183,876 గా నమోదయింది. కోవిడ్ -19 యొక్క క్రియాశీల కేసులు 4,30,422 వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం కేసులలో కరోనా యాక్టివ్ కేసులు 1.39 శాతం ఉన్నాయి.

నిన్నటి కంటే తగ్గిన కేసులు, మరణాలు
ఈరోజు నమోదైన మొత్తం కొత్త కేసులు, నిన్న నమోదైన 41,806 కేసులతో పోల్చినట్లయితే 2,857 తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో మరణాల లోనూ నేడు 542 మంది మరణించడం, నిన్న 581 మరణాల తో పోలిస్తే 39 తక్కువ. కరోనా మహమ్మారి కి సంబంధించి ఇప్పటి వరకు మొత్తం నిర్ధారణ పరీక్షలు 44,00,23,239 నిర్వహించినట్లు గా సమాచారం, గత 24 గంటల్లో 19,55,910 నమూనాలను పరీక్షించామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) శుక్రవారం తెలిపింది.
కేరళ, మహారాష్ట్రలలో సగానికి పైగా కేసులు
కరోనా మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ మధ్య భారతదేశంలో రోజువారీ అంటువ్యాధులలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ, దేశంలో కరోనా థర్డ్ వేవ్ రాక అనివార్యం అని తెలుస్తుంది.దేశంలో నమోదైన కేసులలో సగానికిపైగా కేరళ, మహారాష్ట్రలోనే వెలుగు చూస్తున్న పరిస్థితి ఉంది. కేరళలో తాజాగా 13 వేల కేసులు, మహారాష్ట్రలో ఎనిమిది వేల కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రాలలో కరోనా కట్టడి కోసం మళ్ళీ లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు.
కరోనా థర్డ్ వేవ్ భయం కన్వర్ యాత్ర విషయంలో సుప్రీం అసహనం
కోవిడ్ -19 భారీగా వ్యాప్తి చెందుతుందనే భయాలు ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కన్వర్ యాత్రకు అనుమతి ఇచ్చింది. వార్షిక తీర్థయాత్రకు అనుమతించాలన్న యుపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆందోళన చెందామని సుప్రీంకోర్టు బుధవారం సూచించింది. యాత్ర సందర్భంగా అన్ని కోవిడ్ -19 ప్రోటోకాల్‌లను అనుసరిస్తామని రాష్ట్ర ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్ చెప్పారు. కానీ, ఉత్తర ప్రదేశ్‌లోని అధికారులు, పోలీసులతో సహా, వేలాది మందిగా తరలి వచ్చే భక్తులు సామాజిక దూరాన్ని అనుసరించడం, మాస్కులు ధరించడం, కోవిడ్ -19 పరీక్షలు చేయించుకోవడం కష్టమని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications