వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో భారీగా క్షీణించిన కరోనా కొత్త కేసులు .. 30 వేలకు దిగువకు కొత్త కేసులు, 415 మరణాలు భారతదేశంలో కరోనా ఉ

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా ఉధృతి క్రమంగా అదుపులోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. తాజా కేసుల్లో భారీగా తగ్గుదల నమోదవుతున్న పరిణామాలు దేశానికి కాస్త ఊరట ఇస్తున్నాయి. 132 రోజులలో భారతదేశం మొదటిసారిగా 30,000 కన్నా తక్కువ కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేసింది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం కేసులు 3.14 కోట్లకు చేరుకున్నాయి.గత 24 గంటల్లో 29,689 తాజా కొత్త కేసులు నమోదు కాగా ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 1.73 శాతంగా ఉంది.

టీకాలు తీసుకున్న వారికి సవాల్ గా కరోనా డెల్టా వేరియంట్ .. భారీగా కేసులు, సాక్ష్యాలివే... బీ అలెర్ట్ !!టీకాలు తీసుకున్న వారికి సవాల్ గా కరోనా డెల్టా వేరియంట్ .. భారీగా కేసులు, సాక్ష్యాలివే... బీ అలెర్ట్ !!

దేశంలో మొత్తం క్రియాశీల కేసులు 3,98,100 గా నమోదయింది. ఇది మొత్తం కేసులలో 1.27%. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క తాజా బులెటిన్ ప్రకారం 4 లక్షల కన్నా తక్కువ క్రియాశీల కేసుల పతనం కూడా 124 రోజుల తరువాత తొలిసారిగా నమోదయింది. గత 24 గంటల్లో 415 మంది ప్రాణాలు కోల్పోగా, 42,363 మంది రోగులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇది మరణాల సంఖ్యను 4,21,382కు చేర్చింది.

 Corona cases of massive decline in India .. New cases below 30 thousand, 415 deaths

ఇక ఇప్పటి వరకు నమోదైన రికవరీలు 3,06,21,469గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనావైరస్ కోసం 17,20,100 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. మొత్తం 45,91,64,121 కు చేరుకుంది. కోవిడ్ -19 కి వ్యతిరేకంగా 66 లక్షల వ్యాక్సిన్ల మోతాదులు గత 24 గంటల్లో ఇవ్వబడ్డాయి. జాతీయ టీకాల డ్రైవ్‌లో భాగంగా టీకాల మొత్తం సంఖ్య 44.19 కోట్లకు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

English summary
India registered less than 30,000 new coronavirus cases for the first time in 132 days (March 16) with 29,689 fresh infections being registered in the last 24 hours. This took the country active case tally to 3,98,100 which 1.27% of the total cases. The fall in active caseload below 4 lakh is also after 124 days, according to the latest updates from the Union Health Ministry’s Covid bulletin. The daily positivity rate stood at 1.73 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X