ఉధృతంగా కరోనా కేసులు: తాజాగా ఏడువేలకు పైగా కొత్తకేసులు; బీ కేర్ ఫుల్!!
భారతదేశంలో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతోంది. తాజాగా పెరుగుతున్న కరోనా కేసులు ఫోర్త్ వేవ్ వస్తుందా అన్న ఆందోళనకు కారణంగా మారుతున్నాయి. భారతదేశంలో గురువారం 7,240 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. గత రోజు కంటే దాదాపు 40 శాతం ఎక్కువ కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర మరియు కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కేసులు బాగా పెరిగాయి.

దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. భారీగా క్రియాశీల కేసులతో ఆందోళన
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో రోజువారీ కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు 94 రోజుల తర్వాత 5,000 దాటాయి. నిన్న దేశం 5,233 కేసులను నివేదించగా ఈరోజు ఏడు వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం నమోదైన కొత్త కేసులతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 32,498కి చేరుకుంది. క్రియాశీల కేసుల సంఖ్య గణనీయంగా పెరగటం ఆందోళన కలిగిస్తుంది.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం
ఎనిమిది తాజా మరణాలతో మరణాల సంఖ్య 5,24,723కి చేరుకుంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి భారతదేశంలో 4.31 కోట్ల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. బుధవారం మహారాష్ట్రలో 2,701 తాజా కేసులు నమోదయ్యాయి. జనవరి 25 నుండి ఇప్పటివరకు అత్యధికంగా ప్రస్తుతం కేసులు నమోదైన పరిస్థితి ఉంది . కనీసం 42 శాతం ఇన్ఫెక్షన్లు ముంబై నుండి నమోదయ్యాయి. పశ్చిమ రాష్ట్రం B.A.5 వేరియంట్‌లో ఒక కేసును నివేదించింది.

కేరళలోనూ కరోనా ఉధృతి..
కేరళలో గత 24 గంటల్లో 2,271 కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణాది రాష్ట్రంలో ఒక్క వారంలో 10,805 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో కరోనా నియంత్రణా చర్యలకు శ్రీకారం చుట్టారు కేరళ అధికార యంత్రాంగం. మాస్కులు ధరించటం, సామాజిక దూరం పాటించటం వంటి నిబంధనలను మళ్ళీ అమల్లోకి తెస్తున్నారు.

బాగా పెరిగిన పాజిటివిటీ రేటు.. ఫోర్త్ వేవ్ పై అనుమానం
బుధవారం 3.40 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.13 శాతానికి చేరింది .ఇక క్రియాశీల కేసులో రేటు 0.08 శాతంగా నమోదైంది. దీంతో కేసులు ఇలాగే పెరిగితే ఫోర్త్ వేవ్ వస్తుందన్న అనుమానం ఉంది. పెరుగుతున్న కేసులతో ఇప్పటికే అనేక రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా నియంత్రణకు రాష్ట్రాల ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి.

రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ
ఇప్పటివరకు భారతదేశంలో 4.26 కోట్ల మందికి పైగా కరోనా మహమ్మారిని జయించగా నిన్న ఒక్కరోజే 3,591 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదు కావటం ఆందోళనకు కారణంగా మారింది. ఇక రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 194.59 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 15.43 లక్షల మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'? -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications