వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో ఒమిక్రాన్ తో పాటు కరోనా కల్లోలం: తాజాగా 2510 కేసులు; మహాసర్కార్ ఉక్కిరిబిక్కిరి

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో మళ్ళీ కరోనా కేసుల ఆందోళన కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కేసులు మంగళవారం నాడు 70 శాతం జంప్ చూశాయి. ఇక తాజాగా నేడు 2510 కొత్త కరోనా కేసులతో 82 శాతం ఎక్కువగా కరోనా కేసులను నమోదు చేసింది. కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరగడానికి ముంబై సిద్ధమవుతోందని తాజా పరిణామాలతో అర్థమౌతుంది. మళ్లీ మహారాష్ట్రలో కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ఒక ప్రణాళికను రూపొందించడానికి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

భారత్ లో 781ఒమిక్రాన్ కేసులు, ఢిల్లీలో అత్యధికం; రోజువారీ కోవిడ్ కేసులలోనూ 44శాతం జంప్భారత్ లో 781ఒమిక్రాన్ కేసులు, ఢిల్లీలో అత్యధికం; రోజువారీ కోవిడ్ కేసులలోనూ 44శాతం జంప్

ఒమిక్రాన్ తో పాటు పెరుగుతున్న కరోనా కేసులు.. అధికారులతో సమావేశాలు

ఒమిక్రాన్ తో పాటు పెరుగుతున్న కరోనా కేసులు.. అధికారులతో సమావేశాలు


ఒకపక్క ఒమిక్రాన్ కేసులతో పాటుగా, కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలోముంబయిలో ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలను పెంచి మందులు మరియు ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. దానితో పాటు, పెద్దలు మరియు పిల్లలకు టీకాలు వేయడంపై పెద్ద ఎత్తున దృష్టిసారించినట్లు సమాచారం. ముంబై లో కేసులు పెరుగుతున్న దానిపై వరుస ట్వీట్‌లలో, ఆదిత్య థాకరే ప్లాన్‌లోని ముఖ్య అంశాలను వివరించారు. ఇందులో 15-18 ఏళ్ల వయస్సు వారికి ప్రతిపాదిత టీకాను మేము జనవరి ప్రారంభంలో నిర్వహించాలనుకుంటున్నామని పేర్కొన్నారు.

15 నుండి 18 సంవత్సరాల యువతకు టీకా డ్రైవ్ పై మంత్రి ట్వీట్

15 నుండి 18 సంవత్సరాల యువతకు టీకా డ్రైవ్ పై మంత్రి ట్వీట్

రాబోయే 48 గంటల్లో, 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారందరికీ టీకా డ్రైవ్‌ను నిర్వహించేందుకు నగరంలోని అన్ని విద్యాసంస్థలతో అనుసంధానం చేసుకోబోతున్నట్లుగా అని ఆయన మరో ట్వీట్‌లో తెలిపారు. జంబో కోవిడ్ కేర్ సెంటర్‌లు మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రాథమిక సౌకర్యాలతో పాటు అన్ని సంసిద్ధత స్థాయిలలో అందుబాటులో ఉండాలని కోరారు. ఇదే సమయంలో టెస్టింగ్ మరియు ట్రేసింగ్ ప్రోటోకాల్‌లు కూడా సమీక్షించబడ్డాయని వెల్లడించారు. కోవిడ్-తగిన ప్రవర్తన మార్గదర్శకాలు, పబ్లిక్ ప్లేస్ లలో కార్యక్రమాలు, సమావేశాల సమస్యలపై కూడా చర్చలు జరిగాయని, ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలపై విధించిన ఆంక్షలపై ఆయన మరో ట్వీట్ చేశారు.

కరోనా మూడో వేవ్ పై నిపుణులే చెప్పాలి, అయినా నిబంధనలు పాటించాలి

కరోనా మూడో వేవ్ పై నిపుణులే చెప్పాలి, అయినా నిబంధనలు పాటించాలి

దేశ ఆర్థిక రాజధాని నేడు 2,000 కేసులు దాటవచ్చని థాకరే అన్నారు. ఇది కోవిడ్ యొక్క మూడవ తరంగానికి నాంది కాదా అని అడిగినప్పుడు, వైద్యులు మరియు శాస్త్రవేత్తలు నిర్ణయించాలని అన్నారు. ఆందోళనకరమే అయినా భయాందోళనలు చెందవద్దని అందరినీ కోరుతున్నానని , కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన ట్వీట్ చేశారు. కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు.

పెరుగుతున్న కేసులతో ఆందోళన ఉందన్న ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే

పెరుగుతున్న కేసులతో ఆందోళన ఉందన్న ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే

డిసెంబర్ 8 నుండి మూడు వారాల్లో కేసులు 188 శాతం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఇక ఇదే సమయంలో బుధవారం నాడు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తాజా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆందోళనకరమైన పరిస్థితి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య రెట్టింపు కావడం మరియు ముంబైలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య కూడా ఈ రోజు 2200 దాటవచ్చని దాటవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రులు ఆందోళన వ్యక్తం చేసిన విధంగానే ఈ రోజు ముంబైలో 2510 కరోనా కేసులు నమోదయ్యాయి. మరి పెరుగుతున్న కేసులతో ముంబైలో కఠిన ఆంక్షల దిశగా మహా సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుందని తెలుస్తుంది.

English summary
Along with Omicron variant, corona creates turmoil in Mumbai. Recently, 2510 corona cases were reported in Mumbai. The Maharashtra govt is conducted meetings and preparing plans with the latest conditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X