కరోనా మరణ మృదంగం .. తాజాగా 354 మంది మృతులు, కేసుల్లో టాప్ 10 నగరాలివే
భారతదేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుతున్నట్లు కనిపించినా, మరణాల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో ఇండియాలో 53,480 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 354 మంది మరణించారు. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1, 21 ,49, 335 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి.

గత 24 గంటల్లో 354 మంది మృతులు
ఇక క్రియాశీల కేసుల సంఖ్య నిన్న ఒక్కరోజే 11,846 కు పెరిగింది. దీంతో ప్రస్తుతం భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న కరోనా యాక్టివ్ కేసులు 5 ,52 , 566 కు చేరుకుంది.
నిన్నటికి నిన్న కరోనా మహమ్మారి కారణంగా 271 మంది ప్రాణాలు కోల్పోతే , ఇక గత 24 గంటల్లో 354 మంది మరణించడం ఆందోళనకరంగా మారింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన మరణాల సంఖ్య
1,62,468 కు చేరుకుంది.

రోజురోజుకూ అధ్వానంగా కరోనా పరిస్థితులు
గత 24 గంటల్లో ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయిన రోగుల సంఖ్య 41,280 గా ఉంది.
కోవిడ్ -19 పరిస్థితి దేశంలో రోజురోజుకు అధ్వానంగా మారుతోంది . దేశ ప్రజలకు ఆందోళన కలిగించేలా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది . మహమ్మారి కారణంగా దేశం మొత్తం ప్రమాదంలో ఉందని కేంద్ర సర్కార్ హెచ్చరించింది . కరోనా మహమ్మారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆస్పత్రులు మరియు ఐసియులు సిద్ధంగా ఉండాలని , కేసులు వేగంగా పెరిగితే, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మునిగిపోతుంది అని నీతి ఆయోగ్ సభ్యుడు వి కె పాల్ హెచ్చరించాడు.

కరోనా అత్యధిక కేసుల టాప్ 10 నగరాలివే
దేశంలోని టాప్ 10 కోవిడ్ -19 కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో ఎనిమిది మహారాష్ట్రకు చెందినవని, ఇక టాప్ టెన్ జాబితాలో ఢిల్లీ కూడా ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పారు.
విపరీతంగా కరోనా కేసులు నమోదవుతున్న టాప్ 10 జిల్లాలు చూస్తే పూణే (59,475), ముంబై (46,248), నాగ్‌పూర్ (45,322), థానే (35,264), నాసిక్ (26,553), ఔరంగాబాద్ (21,282), బెంగళూరు అర్బన్ (16,259), నాందేడ్ (15,17) ), ఢిల్లీ (8,032), అహ్మద్‌నగర్ (7,952) లు ఉన్నట్లుగా తెలుస్తుంది.

రికవరీ రేటు తగ్గుతుందని ఆరోగ్య శాఖ ఆందోళన
పెద్ద ఎత్తున పరీక్షలు చేయడం , కరోనా పాజిటివ్ కేసులను నిర్ధారించడం , చికిత్స చేయడం మాత్రమే అందరి ముందున్న వ్యూహమని కరోనా నిబంధనలను పాటిస్తూనే అన్ని రాష్ట్రాలు ఈ పని చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి భూషన్ వెల్లడించారు . ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 94.19 శాతానికి పడిపోయిందని పెరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications