భారత్ లో తాజాగా 14,313 కొత్త కేసులు, 549 మరణాలు; వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి ఇలా..!!

భారతదేశంలో కరోనా వ్యాప్తికి కొనసాగుతోంది. కొద్దిపాటి హెచ్చుతగ్గులతో కరోనాకేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా దేశంలో 14,313 తాజా కేసులను నమోదు చేసింది. అదే సమయంలో, 549 వైరస్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయి.

14వేలకు పైగా కరోనా కొత్త కేసులు ... రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ
శుక్రవారం రోజు 11,76,850 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 14,313 మంది కరోనా మహమ్మారి బారిన పడినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దీంతో భారత దేశంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 3.42 కోట్లకు చేరుకుంది. శుక్రవారం నాడు 13,543 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకోగా దేశంలో మొత్తం రికవరీలు 3.36 కోట్ల మార్కును దాటాయి. ఇక క్రియాశీల కేసులు తగ్గుదలకు బ్రేక్ పడి కొద్దిగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో 1,61,555 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

corona in India: 14,313 new cases, 549 deaths; Corona situation in different states !!

ఒక్కరోజులో 549 కరోనా మరణాలు
క్రియాశీల కేసుల రేటు 0.47 శాతంగా ఉండగా రికవరీ రేటు 98.19 శాతంగా నమోదయింది.మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,36,41,175 గా నమోదయింది. దేశంలో శుక్రవారం ఒక్కరోజే 549 కరోనా మరణాలు నమోదయ్యాయి. అందులో 471 కేరళ నుంచి నమోదైన మరణాలే. దీంతో ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా మొత్తం మరణించిన వారి సంఖ్య 4,57,740 గా నమోదయింది. రోజువారీ పరీక్ష పాజిటివిటీ రేటు 1.22 శాతంగా ఉంది, అయితే వీక్లీ పాజిటివిటీ రేటు గత 30 రోజులుగా 1.18 శాతం వద్ద రెండు శాతం కంటే తక్కువగా కొనసాగింది.

కేరళ , మహారాష్ట్రలలో తాజా కరోనా పరిస్థితి ఇదే
కేరళలో తాజాగా 7,772 కేసులు నమోదయ్యాయి, కేసుల సంఖ్య 49,44,857కి చేరగా, 471 మరణాలతో మరణాల సంఖ్య 31,156కి పెరిగింది. 471 మరణాలలో, 86 శుక్రవారం నమోదయ్యాయి, మిగిలినవి గత కొన్ని రోజుల్లో నమోదైన మరణాలు కాగా వాటిని డేటా లో కేరళ ప్రభుత్వం సవరించింది. మహారాష్ట్ర ఆరోగ్య బులెటిన్ ప్రకారం, మహారాష్ట్రలో గత 24 గంటల్లో 1,338 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 36 మంది మరణించగా, గత 24 గంటల్లో 1,584 మంది రోగులు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 64,47,038 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు.

ఢిల్లీలో బాగా తగ్గిన కరోనా ..90 శాతానికి పైగా ప్రజలలో యాంటీ బాడీస్
ఢిల్లీలో గత 24 గంటల్లో 37 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. నగరంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. నగరంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,39,788కి పెరిగింది .నగరంలో యాక్టివ్ కేసుల సంఖ్య 334గా ఉంది. ఢిల్లీలో 90 శాతానికి పైగా ప్రజలు కరోనావైరస్ కోసం యాంటీ బాడీలను కలిగి ఉన్నారని, దేశ రాజధానికి సంబంధించిన ఆరవ సెరో-సర్వే నివేదికను సిద్ధం చేసిన వర్గాలు తెలిపాయి. నగరంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో, ఢిల్లీ ప్రభుత్వం సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల నిబంధనలను సడలించింది. వీటిని సోమవారం నుండి పూర్తి సీటింగ్ సామర్థ్యంతో తిరిగి తెరవడానికి అనుమతి ఇచ్చారు.

105 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసిన ప్రభుత్వం
ఈశాన్య ప్రాంతంలో, అస్సాంలో గత 24 గంటల్లో మొత్తం 322 కొత్త కేసులు మరియు మూడు మరణాలు నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన కొత్త కేసులతో, రాష్ట్రంలో 2,444 యాక్టివ్ కేసులతో సహా మొత్తం కేసుల సంఖ్య 6,10,150కి చేరుకుంది.మధ్యప్రదేశ్‌లో, రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 15 నుండి ప్రత్యేక టీకాలు వేసే డ్రైవ్‌ను ప్రారంభించనుంది. ఈ సంవత్సరం చివరినాటికి మొత్తం అర్హులైన జనాభాను కవర్ చేయడానికి పబ్లిక్ ఈవెంట్‌లలో టీకా మరియు పరీక్షా శిబిరాలను నిర్వహిస్తుంది. రాష్ట్రం ఇప్పటివరకు ఏడు కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోస్‌లను అందించింది. ఇక కరోనా నియంత్రణ కోసం కొనసాగిస్తున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటి వరకు 105 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రభుత్వం పంపిణీ చేసినట్టు వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకా వేయించుకున్న వారి సంఖ్య 56,91,175.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+