Corona Cases In India: మళ్ళీ భారీగా .. 37,593 కరోనా కొత్త కేసులు, 648 మరణాలు, కేరళలో పంజా !!

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా కరోనా కేసుల ఊగిసలాట కనిపిస్తుంది. ఒకరోజు కేసులు భారీగా తగ్గితే, ఒకరోజు కేసులు భారీగా పెరుగుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో భారతదేశం 37,593 కోవిడ్-19 కేసులను నమోదు చేసింది. ఇది నిన్నటి సంఖ్య (25,467) కంటే 47.6 శాతం ఎక్కువ. మరణాలు కూడా అధికంగా నమోదయ్యాయి. దేశం 648 మరణాలను గత 24 గంటల్లో నమోదుచేసింది. ఇది నిన్న నివేదించిన 354 మరణాల నుండి భారీ పెరుగుదలగా కనిపిస్తుంది.

 కరోనా కారణంగా 4,35758 మంది మృతి

కరోనా కారణంగా 4,35758 మంది మృతి

గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 4,35758 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 31,169 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు .ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.17 కోట్ల మంది కరోనాను జయించగా, రికవరీ రేటు 97.67 శాతానికి చేరుకుంది. మరోవైపు కరోనా క్రియాశీల కేసుల రేటు గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు దేశంలో ఒక శాతం కంటే దిగువకు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,22,327 మంది కరోనాతో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.99గా నమోదవుతుంది.

రోజువారీ కేసుల్లో కేరళ టాప్ .. కొనసాగుతున్న కరోనా కల్లోలం

రోజువారీ కేసుల్లో కేరళ టాప్ .. కొనసాగుతున్న కరోనా కల్లోలం

ఇక దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 61,90,930 మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు. ఇప్పటివరకు 59.55 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. 24,296 కొత్త కేసులతో, రోజువారీ కోవిడ్ కేసులలో కేరళ దేశంలోనే రోజువారి కేసు నమోదులో అగ్రగామిగా కొనసాగుతోంది. రాష్ట్రం కూడా 173 మరణాలను నివేదించింది. ఒక కేరళ రాష్ట్రం నుండే దాదాపు 65 శాతం కొత్త కేసులు నమోదవుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా రెండో దశ విజృంభణ నుండి కేరళ రాష్ట్రం ఇంకా కోలుకున్నట్లుగా కనిపించడం లేదు.

 దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గని కరోనా జోరు

దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గని కరోనా జోరు

కేరళ తర్వాత మహారాష్ట్ర అత్యధిక రోజువారి కరోనా కేసులను నమోదు చేసింది. మహారాష్ట్ర గత 24 గంటల్లో 4,355 కరోనా కేసులు నమోదు చేసింది. ఇదే సమయంలో కరోనా కారణంగా మహారాష్ట్రలో 288 మంది మృతి చెందారు. తమిళనాడు 1,585 కేసులతో, కర్ణాటక 1,259, ఆంధ్రప్రదేశ్ 1,248 కరోనా కేసులను నమోదు చేశాయి. తెలంగాణలో 389 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే గుజరాత్ 14 కోవిడ్ కేసులను నమోదు చేసింది. రాజస్థాన్ లో 10, బీహార్ లో 9, మధ్యప్రదేశ్ లో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగు పెద్ద రాష్ట్రాలు ఒక రోజులో ఒక్క కరోనా మరణాన్ని కూడా నమోదు చేయలేదు.

Recommended Video

    Prime Minister Narendra Modi on Tuesday spoke to Russian President Vladimir Putin on Afghanistan
    ఇండియాలో స్థానికత దశకు చేరుకుంటున్న కరోనా

    ఇండియాలో స్థానికత దశకు చేరుకుంటున్న కరోనా

    దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో 151 తాజా కోవిడ్ కేసులు, సున్నా మరణాలు సంభవించాయి. ఉత్తర ప్రదేశ్, అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం, 26 తాజా కోవిడ్ కేసులు మరియు ఒక రోజులో ఇద్దరు మరణించారు. భారతదేశంలో కోవిడ్ -19 అనేది ఒక విధమైన స్థానికత దశలోకి ప్రవేశిస్తుంది. అక్కడ తక్కువ లేదా మధ్యస్థ స్థాయి ప్రసారం జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. జనాభా వైరస్‌తో జీవించడం నేర్చుకోవడమే స్థానిక దశ అని వెల్లడిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+